ఇంగ్లాండ్ టెస్ట్ లో ట్రిపుల్ సెచరీ కొట్టి అజేయంగా నిలిచిన కరుణ్ నాయర్ తను కొన్న ఫోర్డ్ ముస్టాగ్ కార్ కు అదే నంబర్ ను వచ్చేలా చేసుకున్నాడు. సెహ్వాగ్ తర్వాత త్రి శతకం బాదిన బ్యాట్స్ మన్ గా క్రేజ్ తెచ్చుకున్న కరణ్ నాయర్ తన కార్ నంబర్ 303 ఉండేలా చూసుకున్నాడు.


తనని ప్రపంచానికి పరిచయం చేసిన ఆ ఇన్నింగ్ తన జీవితంలో చాలా కీలకం అందుకే కరణ్ నాయర్ కార్ నంబర్ అలా పెట్టుకున్నాడు. ఇక కార్ నంబర్ ప్లేట్ చూస్తే కె.ఏ 03 ఎన్.ఏ 303 గా కనిపిస్తుంది. ఇక్కడ విశేషం ఏంటంటే మొదటి కె.ఏ కరణ్ కాగా తర్వాత వచ్చిన ఎన్.ఏ నాయర్ గా అనుకోవచ్చు. అలా తన ఇన్నింగ్స్ ను ఎప్పటికి మర్చిపోలేనిదిగా తన కార్ నంబర్ ప్లేట్ పై పెట్టుకుని సర్ ప్రైజ్ ఇచ్చాడు కరణ్ నాయర్.  



మరింత సమాచారం తెలుసుకోండి: