టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఎంతో మందికి రోల్‌ మోడల్‌. నేటి తరం అత్యుత్తమ ఆటగాళ్లలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నాడు.  అయితే, కోహ్లీ ఇంతటి ఘన విజయం సాధించేందుకు ఓ పుస్తకమే కారణమట. 'ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి' పుస్తకాన్ని చదవడమే తన విజయానికి కారణమని కోహ్లీ స్వయంగా తెలిపాడు. 



పరమహంస యోగానంద జీవితంపై రాసిన ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదివి తీరాలని కోరాడు. ఈ బుక్‌ను చదివితే జీవితాన్ని చూసే దృష్టికోణం మారుతుందని తాను కచ్చితంగా నమ్ముతున్నానని రాశాడు. ఈ పుస్తకంలోని జ్ఞానాన్ని సరిగా వినియోగించుకుంటే... అది మన జీవన విధానాన్నే మార్చివేస్తుందని కోహ్లీ చెప్పాడు. మంచి పనులు చేయడం, ప్రేమించడం, గొప్పగా ఉండటం, ఒకరికొకరు సహకరించుకోవడం వంటివి మనలను ఉన్నతులను చేస్తాయని తెలిపాడు.



ఈ పుస్తకాన్ని పరమహంస యోగానంద రచించారు. పుస్తకసారాన్ని అర్థం చేసుకుని వాటిని ఆచరించగలిగితే జీవితమే సమూలంగా మారుతుందని కోహ్లీ రాసుకున్నాడు. కోహ్లీ రాసుకున్న ఈ పుస్తకం మరెంతమంది జీవితాలను మారుస్తుందో, ఎంత మంది అభివృద్ధికి దోహదపడుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: