స్లెడ్జింగ్ అనేది ఆటలో భాగం మాత్రమే కాని అది వ్యక్తిగత కక్షలకు దారితీయకూడదు అని అంటున్నాడు గౌతం గంభీర్. కేవలం ఆటలో బ్యాట్ బాల్ తో ఆడితే బాగోదని ఆటలో సరదాగా ప్రత్యర్ధులు స్లెడ్జింగ్ చేస్తేనే మజా ఉంటుందని అంటున్నాడు. ఆడేది రోబోలు కాబట్టి ఆటలో స్లెడ్జింగ్ కామన్ అంటున్నాడు. కాని అది కేవలం ఆటకే పరిమితమవ్వాలి అంటున్నాడు. 


ఇక రాంచి టెస్ట్ లో ఇరు జట్లు అద్భుతమైన ప్రదర్శన చేశాయన్న గంభీర్. ధర్మశాలలో జరుగబోయే టెస్ట్ లో భారత జట్టే హాట్ ఫేవరేజ్ అని అన్నాడు. అయితే ధర్మశాలలో జరిగే 4వ టెస్ట్ లో విజయం తమదే అని ధీమాగా ఉన్న ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ స్మిత్ వ్యాఖ్యలను గంభీర్ కొట్టిపడేశాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: