భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన నాలుగు టెస్ట్ ల సీరీస్ లో భారత జట్టు 2-1 తేడాతో టీం ఇండియా విజయం సాధించింది. అయితే ఈ మ్యాచులు జరుగుతున్న సందర్భంలో ఆస్ట్రేలియా కెప్టెన్ మైదానంలో చాలా సందర్భాల్లో అతిగా స్పందించాడని ఆస్ట్రేలియా మాజి క్రికెటర్ కెర్రి ఒకీఫ్ అన్నారు.


అతనికి నాయకుడికి ఉండాల్సిన లక్షణాలేవి లేవని తీవ్రంగా మండిపడ్డారు. జరిగిన టెస్ట్ లో స్మిత్ ప్రతి మ్యాచ్ లో ఫీల్డ్ లో అతిగా ప్రవర్తించాడని ఓ కెప్టెన్ గా అది తనకు తగదని అన్నాడు ఒకీఫ్. ఇక టెస్ట్ సీరీస్ లో స్మిత్ చేసిన రచ్చకు అతను సారీ చెప్పాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. మొత్తానికి సక్సెస్ ఫుల్ కెప్టెన్ అనిపించుకున్న స్టీవ్ స్మిత్ టీం ఇండియా ఓటమితో ఎన్నో మాటలు పడాల్సి వస్తుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: