ఈ ఐపిఎల్ లో చెప్పుకోదగ్గ మ్యాచ్ లల్లో జరిగిన ఢిల్లి, హైదరాబాద్ ల మధ్య ఈ మ్యాచ్ గురించి చెప్పొచ్చు. నువ్వా నేనా అన్నట్టు రెండు జట్లు తమ అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. చివరి బంతి వరకు గెలిచేది ఎవరు అన్న ఉత్కంఠత సాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ జట్టు కెప్టెన్ హిట్టర్ డేవిడ్ వార్నర్ ను 4 పరుగులకే అవుట్ చేయగా మరో ఓపెనర్ శిఖర్ ధావన్ విజృంభించి 70 పరుగులు చేశాడు. ఇక మరో బ్యాట్స్ మన్ విలియం సన్ కూడా దుమ్ముదులిపేశాడు. 89 పరుగుల అత్యధిక స్కోర్ తో సన్ రైజర్స్ స్కోర్ ను పరుగులు పెట్టించాడు. ఫైనల్ గా 20 ఓవర్లలో 4 వికెట్లకు 191 పరుగులు చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు. 


ఇక భారీ లక్ష్య చేదనలో సెకండ్ బ్యాటింగ్ దిగిన ఢిల్లి డేర్ డెవిల్స్ ఓపెనర్ సాం సన్ 42 గుడ్ స్టార్ట్ ఇచ్చాడు. కరుణ్ నాయర్ 33, శ్రీయస్ అయ్యర్ 50 పరుగులు చేయగా.. చివర్లో మ్యాథ్యూస్ 31 పరుగులు చేశాడు. ఎంత కొట్టినా సరే 15 పరుగుల తేడాతో ఓడిపోయారు. 20 ఓవర్లకు 5 వికెట్లకు గాను 176 పరుగులు చేసింది ఢిల్లి జట్టు. ఈ విక్టరీతో వరుసగా రెండు మ్యాచులు ఓడిన సన్ రైజర్స్ జట్టు మొన్న పంజాబ్ మీద గెలుపుతో పాటుగా ఈరోజు ఢిల్లి మీద గెలిచి జట్టులో హుశారు నింపారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: