లీగ్ దశలు ముగిస్ ప్లే ఆఫ్ లోకి నాలుగు జట్లు స్థానం సంపాదించాయి. పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న ముంబై రెండవ స్థానంలో ఉన్న పూణెతో రేపు మ్యాచ్ ఆడనుంది. అయితే పూణె పై లీగ్ లో రెండు మ్యాచులు ఆడిన ముంబై రెండిటిలోనూ ఓడిపోయింది. ఇక రేపు కూడా ఇదే రిపీట్ అయితే కనుక ఇప్పటిదాకా టాప్ పొజిషన్ లో ఉన్న ముంబై కష్టాల్లో పడాల్సి వస్తుంది.


ఇక ప్లే ఆఫ్ లోకి అడుగుపెట్టిన పూణె ఈసారి కప్ కొట్టేందుకు అన్నివిధాలుగా సన్నద్ధం అవుతుంది. లీగ్ లో ఈ రెండ్ జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచులల్లో ముంబైపై పూణె కొద్ది పరుగుల తేడాతోనే విజయం సాధించింది. మరి పూణె కప్ గెలవాలన్న ఆశ నెరవేరుతుందా లేక ముంబై కప్ కోసం ఫైనల్ కు చేరుకుంటుందా అన్నది చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: