ఎలిమినేటర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ మీద డక్వర్త్ లూయీస్ పద్ధతిలో మ్యాచ్ గెలిచిన కలకత్తా క్వాలిఫైర్ మ్యాచ్ లో మాత్రం ముంబైపై విజయం సాధించలేకపోయింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై జట్టు కలకత్తాని కేవలం 107 పరుగులు మాత్రమే చేసేలా కట్టడి చేసింది. కలకత్తా బ్యాట్స్ మన్ లో సూర్యకుమార్ యాదవ్ 31, ఇషాంక్ జగ్గి 28 తప్ప మిగిలిన వారంతా తక్కువ స్కోర్ కే అవుట్ అయ్యారు. గౌతం గంభీర్ 12 పరుగులు మాత్రమే చేశాడు.  


ఇక లక్ష్యం చిన్నదే అవడంతో ముంబై చేజింగ్ చిన్నగా చేసింది. ఓపెనర్లు సిమన్స్ 3, పార్థివ్ పటేల్ 14 పరుగులకే అవుట్ అవగా క్రునాల్ పాండ్య 45 జట్టు విజయానికి కారకుడయ్యాడు. కెప్టెన్ రోహిత్ శర్మ  26 పరుగులు చేయగా.. చివర్లో పొలార్డ్ 9 పరుగులతో జట్టుకి విజయాన్ని అందించాడు. ఈ విజయంతో ఫైనల్ కు ముంబై చేరుకుంది. ఇక చివరి పోరులో పూణె వర్సెస్ ముంబై లలో ఎవరు ఐపిఎల్ 2017 10వ సీజన్ కప్ గెలుస్తారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: