అంచనాలను తారు మారు చేస్తూ ఈసారి పూణె ఐపిఎల్ కప్ ఎత్తుతుందని ఆశగా చూశారు. కాని కేవలం ఒక్క పరుగు తేడాతో ముంబై మరోసారి ఐపిఎల్ కప్ కైవసం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై 129 పరుగులనే చేసేలా కట్టడి చేసింది. క్రునాల్ పాండ్య 47, రోహిత్ శర్మ 24 పరుగులు చేశారు. 


ఇక లక్ష్యం చిన్నదే అయినా ఏమాత్రం తొందరపడకుండా నిలకడ ఆటతీరుతో పూణె జట్టు చివర్లో మ్యాచ్ చేజేతులా ఓడిపోయేలా చేసుకుంది. స్మిత్ 51 అవుట్ అయిన క్రమంలో కేవలం ఇంకా 11 బంతులు మాత్రమే మిగిలి ఉండటం మ్యాచ్ చాలా ఉత్కంటతతో సాగింది. ఇక 128 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది పూణె. లీగ్ దశలో క్వాలిఫైర్ మ్యాచ్ లో కూడా ముంబైని ఓడించిన పూణె అసలు గెలవాల్సిన ఫైనల్ మ్యాచ్ లో చేతులెత్తేసింది. ఇక ఈ విజయంతో 3 సార్లు ఐపిఎల్ కప్ గెలిచిన జట్టుగా ముంబై రికార్డ్ సృష్టించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: