పాకిస్తాన్ జట్టు గెలిచినా ఓడిపోయినా ఎప్పుడూ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదురుకొంటూ నే ఉంటుంది. ఆ జట్టు ఎప్పుడూ ఏదో ఒక వివాదం లో నలుగుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ లో ఆ జట్టు ప్రతిభ అద్భుతంగా ఉంది. పాకిస్తాన్ జట్టు మీద ఈ టైం లో కూడా ఫిక్సింగ్ ఆరోపణలు వస్తూ ఉండడం బాధాకరం.


సాక్షాత్తూ పాకిస్తాన్ కి మాజీ కెప్టెన్ అయిన అమీర్ సోహైల్ ఈ ఫిక్సింగ్ ఆరోపణలు చేసాడు. అప్పట్లో సయీద్ అన్వర్ తో పాటు బ్యాటింగ్ కి వచ్చే ఆమిర్ సోహైల్ అందరికీ తెలిసిన బ్యాట్స్ మెన్ .. ఈ మధ్యన ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడిన అతను ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ అన్ని మ్యాచ్ లను కెప్టెన్ సర్ఫరాజ్ ఖాన్ ఫిక్స్ చేశాడని సంచలన ఆరోపణలు చేశాడు. ఈ మ్యాచ్ ఫిక్సింగ్ లో బయటి శక్తులు కూడా పని చేశాయని, అక్రమ మార్గంలో పాక్ ఫైనల్ కు చేరిందని చెప్పిన విషయాలు క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి.


ఇతర ఆటల మీద క్రికెటర్ లో ఆరోపణ లు చేస్తూ ఉంటారు కానీ తాజాగా ఈ పరిణామం పెద్ద షాక్ లాగా ఉంది. సొంత క్రికెట్ మీద సొంత టీం మీద ఇతను ఇలా అనడం అత్యంత షాకింగ్ వ్యవహారం. ఆమిర్ చెప్పేది నిజం అయితే ఇండియా - పాకిస్తాన్ ఆడబోతున్న ఫైనల్ మ్యాచ్ కూడా ఫిక్స్ అయ్యే ఉండాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: