టీం ఇండియా కోచ్ పై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. మొదట బిసిసిఎం టీం ఇండియా నూతన కోచ్ గా రవిశాస్త్రిని ప్రకటించింది. ఇంతలో ఏమైందో ఏమో కాని రూచ్ కోచ్ గా ఇంకా ఎవరు నిర్ణయించలేదని ఎనౌన్స్ చేసింది. అయితే కోచ్ గా ఫైనల్ డెశిషన్ ఈరోజు నిర్ణయించాలని బిసిసిఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి ఆదేశించారు.


రవిశాస్త్రిని ప్రధాన కోచ్ గా సెలెక్ట్ చేసే అవకాశం ఉన్నా ఎందుకో మళ్లీ బిసిసిఐ వెనుకడుగు వేస్తుంది. అయితే బిసిసిఐ చేస్తున్న ఈ పనుల పట్ల నెటిజెన్ల నుండి చిత్ర విచిత్రమైన కామెంట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఫోటోలను పెట్టి మరి సెటైర్లు వేస్తుండటం విశేషం. కోచ్ గా ఎవరిని సెలెక్ట్ చేస్తారు అన్న దాని మీద టీం ఇండియా కెప్టెన్ విరాట్ కొహ్లి ను సంప్రదించాకే ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: