అనుకున్నట్టుగానే టీం ఇండియా కొత్త కోచ్ గా రవిశాస్త్రిని ఎంపిక చేశారు. ఇప్పటి నుండి 2019 వరల్డ్ కప్ దాకా భారత జట్టు ప్రధాన కోచ్ గా రవిశాస్త్రి ఉంటారని తెలుస్తుంది. టీం ఇండియాకు ఇదవరకు మాజి డైరెక్టర్ గా ఉన్న రవిశాస్త్రి ఇప్పుడు కోచ్ గా కొత్త పదవి స్వీకరించారు. ఇక రవిశాస్త్రి కోచ్ కావడంలో టీం ఇండియా కెప్టెన్ విరాట్ కొహ్లి ఆడిన గేం అందరికి తెలిసిందే.


తన మాట నెగ్గించుకోవడం కోసం నానా రభస చేసిన కొహ్లి ఫైనల్ గా తనకు నచ్చిన వ్యక్తికే కోచ్ పదవి దక్కేలా చేశాడు. ఇక బౌలింగ్ కోచ్ గా జహీర్ ఖాన్ సెలెక్ట్ అవడం విశేషం. కూంబ్లేని సెలెక్ట్ చేసిన సమయంలోనే కోచ్ పదవి తనకు దక్కకుండా చేశాడని గంగూలి మీద విమర్శలు చేశాడు రవిశాస్త్రి. అయితే కాదన్న తననే పిలిచి మళ్లీ కోచ్ గా తీసుకున్నందుకు రవిశాస్త్రి చాలా సంతోషంగా ఉన్నారట.



మరింత సమాచారం తెలుసుకోండి: