టీం ఇండియా కొత్త కోచ్ గా భాధ్యతలను చేపట్టిన రవిశాస్త్రి తనకు నచ్చిన వారినే తన టీం లో ఉండేలా చూస్తున్నాడు. రవిశాస్త్రితో పాటుగా బౌలింగ్ కోచ్ గా జహీర్ ఖాన్ సెలెక్ట్ అవ్వగా జహీర్ కన్నా మాజీ బౌలింగ్ కోచ్ భరత్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట రవిశాస్త్రి. జహిర్ కేవలం సంవత్సరానికి 100 రోజులు మాత్రమే కోచ్ గా ఉంటాడు మిగతా టైంలో భరత్ ను వాడుకోవాలని ఫిక్స్ అయ్యాడు రవిశాస్త్రి. 


ఇక టీం ఇండియా బోర్డ్ డైరక్టర్ గా ఉన్నప్పుడు భరత్ టీం ఇండియా బౌలింగ్ కోచ్ గా ఉన్నాడు. అంతేకాదు అండర్ 19 నుండి భరత్ రవిశాస్త్రి మంచి స్నేహితులు అందుకే జహిర్ తో పాటుగా భరత్ ను బౌలింగ్ కోచ్ గా ఉంచేలా తన ప్రయత్నాలు చేస్తున్నాడు రవిశాస్త్రి. జహిర్ ఉన్నా భరత్ సేవలను వాడుకునేలా బిసిసిఐకు ఓ నివేదికను సమర్పించాలని రవిశాస్త్రి అనుకుంటున్నాడట.



మరింత సమాచారం తెలుసుకోండి: