టెన్నిస్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్ మరో సంచలన విజయం అందుకున్నాడు. వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ లో మరోసారి తన విజయ పతాకం ఎగురవేశాడు. 8 సార్లు టైటిల్ గెలిచిన రోజర్ ఫెదరర్ టెన్నిస్ చరిత్రలో సంచలనంగా మారాడు. ఈరోజు జరిగిన ఫైనల్ మ్యాచ్ లో మారిన్ సిలిచ్ ను 6-3, 6-1, 6-4 తో మూడు సెట్లు కొట్టి టైటిల్ కొట్టేశాడు. 


35 ఏళ్ల వయసుగల ఫెదరర్ వింబుల్డన్ టైటిల్ 8వ సారి గెలుచుకున్నాడు. ఇక మొత్తం టెన్నిస్ రంగంలో 19 గ్రాండ్ స్లాం టైటిల్ సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా 29 ఫైనల్స్ ఆడిన క్రీడాకారుడిగా ఫెదరర్ సరికొత్త రికార్డ్ అందుకున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: