సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో ఇండియాతో 5 వన్ డేలు, 3 టి20 మ్యాచులు ఆడనుంది ఆస్ట్రేలియా జట్టు. ఇక ఈ సీరీస్ లో తమ జట్టు మంచి విజయాన్ని అందుకోవాలని అన్నారు ఆసిస్ మాజి కెప్టెన్ మైకెల్ క్లార్క్. ఇక ప్రస్తుతం టీం ఇండియా చాల బలంగా ఉందని అది కూడా సొంతగడ్డపై టీం ఇండియాను ఓడించడం కష్టంతో కూడుకున్న పని అని అన్నాడు క్లార్క్.


కొహ్లి నాయకత్వంలో టీం ఇండియా మంచి నైపుణ్యత ప్రదర్శిస్తుందని. వెస్టిండీస్, శ్రీలంకల సీరీస్ విజయాలతో టీం ఇండియా దూసుకెళ్తుందని అన్నారు. కొహ్లి మ్యాచ్ మ్యాచ్ కు తన వ్యూహాలు మార్చి విజయాలను అందుకుంటున్నాడని.. ఇక ఇలానే విజయ పరంపర కొనసాగిస్తే టీం ఇండియా నెంబర్ 1 పొజిషన్ లో ఉంటుందని క్లార్క్ అభిప్రాయపడ్డాడు.  



మరింత సమాచారం తెలుసుకోండి: