టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఫ్యాన్స్ చాలా ముద్దు పేర్లు, బిరుదులు ఇచ్చేశారు. ఇండియన్ రన్ మిషన్, పరుగుల వీరుడు, చీకూ అంటూ ముద్దు ముద్దుగా పిలుచుకుంటారు. అయితే తాజాగా కోహ్లీకి ఐసీసీ ఓ బిరుదు ఇవ్వడం విశేషం. కోహ్లీ ఛేజింగ్ అంటే ఎక్కువగా లైక్ చేస్తాడు. అలాంటప్పుడే ఎక్కువగా పరుగులు రాబడతాడు. దీంతో ఐసీసీ విరాట్ కు 'ఛేజ్‌ మాస్టర్' అంటూ బిరుదు ఇచ్చేసింది.


దీనికి ఉదాహరణగా రీసెంట్ గా శ్రీలంకతో జరిగిన అన్ని మ్యాచ్ లను చెప్పొచ్చు. టూర్ లో కోహ్లీ సేన ఎక్కువగా ఛేజ్‌ లు చేయడానికే ఇంట్రెస్ట్ చూపించింది. అలా ఛేజ్‌ లు చేసి టూర్ మొత్తాన్ని క్లీన్ స్విప్ చేసేశారు. ఇంటర్నేషనల్ క్రికెట్ లో కోహ్లీ ఎక్కువగా ఛేజ్‌ లు చేసే రన్స్ రాబట్టుకున్నాడు.  టీ20 లలో అయితే ఛేజ్‌ లు చేసి 1016 రన్స్ చేశాడు.  రీసెంట్ మ్యాచ్ లో ఏకంగా 82 రన్స్ చేశాడు. విరాట్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. దీంతో ఐసీసీ ఈ యంగ్ కెప్టెన్ కి 'ఛేజ్ మాస్టర్' అని బిరుదు ఇచ్చేసింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: