స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్ తన కెరీర్ లో 16వ గ్రాండ్ స్లామ్ టైటిల్ ను దక్కించుకున్నాడు. న్యూయార్క్ లో జరిగిన యూఎస్ ఓపెన్ మేల్ చాంపియన్ షిప్ పోటీలో కెవిన్ ఆండర్సన్ ని మట్టికరిపించాడు.కెవిన్ ఏ రకంగాను నాదల్ కు పోటీ ఇవ్వలేకపోయాడు. దీంతో 6-3, 6-3, 6-4 తేడాతో వరుస సెట్లలో రెండు గంటల్లోనే రఫెల్ నాదల్ విజయాన్ని కైవసం చేసుకున్నాడు.


టైటిల్ చేజిక్కించుకున్న రఫెల్ నాదల్ కు రూ. 23.61 కోట్లు ప్రైజ్ మనీ దక్కింది. అలాగే ఫైనల్ వరకూ వెళ్లిన ఆండర్సన్ కు రూ. 11.64 కోట్లు ప్రైజ్ మనీగా ఇచ్చారు. ఈ ఏడాది నాదల్ హవా కొనసాగుతోంది. ఇప్పటికే రెండు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ దక్కించుకున్నాడు. 


పురుషుల సింగిల్స్ లో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ని స్విస్ ఆటగాడు రోజర్ ఫెదరర్ కైవసం చేసుకున్నాడు. అతను ఏకంగా 19 టైటిల్స్ తో టాప్ ప్లేస్ లో నిలిచాడు. నెక్ట్స్ ప్లేస్ లో 16 టైటిల్స్ తో రఫెల్ నాదల్ నిలిచాడు.  ఆ తర్వాతి స్థానంలో పీట్‌ సంప్రాస్‌ (14), జొకొవిచ్ (12), ఎమర్సన్‌ (12)లు ఉన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: