అంతర్జాతీయ క్రికెట్ తీరులో కొన్ని మార్పులను చేస్తూ ఐసిసి కీలక నిర్ణయాలను తీసుకుంది. ఈ నెల 28నుండి ఈ మార్పులు అమలు పరుస్తారని తెలుస్తుంది. ప్రత్యర్ధి ఆటగాడితో గొడవ పడటం ఇక అంపైర్ ను కూడా బెదిరించాలని చూసినా సరే అంపైర్ తీసుకునే నిర్ణయానికి బలి కావాల్సిందే. ఆటలో ఏ సమయంలో అయినా క్రీడాకారుడి తీరు నచ్చకపోతే అతన్ని బయటకు పంపించే హక్కు అంపైర్ కు ఇచ్చారు.


సౌతాఫ్రికా - బంగ్లాదేష్, పాకిస్థాన్ -  శ్రీలంక టెస్ట్ సీరీస్ లలో ఈ కొత్త రూల్స్ అమలు చేస్తున్నారు. ఇప్పటికే సీరీస్ మొదలవడంతో భారత్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ లకు పాత రూల్స్ ఫాలో అవుతారు. ఇక అంపైర్లకు కొత్త నింబంధనలు అర్ధం చేసుకునేలా ఇప్పటికే వారికి ఓ వర్క్ షాప్ కూడా డిజైన్ చేశారట. 



మరింత సమాచారం తెలుసుకోండి: