భారత్ ఆస్ట్రేలియా మధ్య హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగాల్సిన 3వ టి20 మ్యాచ్ వర్షం పడకుండానే క్యాన్సిల్ అయ్యింది. గతవారం నుండి హైదరాబాద్ లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ఉప్పల్ స్టేడియం అవుట్ ఫీల్డ్ దారుణంగా తయారయ్యింది. తేమని ఆరబెట్టేందుకు స్టాండ్ ఫ్యాన్లు పెట్టినా సరే లాంభం లేకుండా పోయింది. సాయంత్రం టాస్ వేసే సమయంలో డౌటుగా ఉండగా ఫైనల్ గా మ్యాచ్ రద్దు చేశారు.


వర్షానికి పిచ్ తడవకుండా పరదాలు కప్పినా సరే అవుట్ ఫీల్డ్ ఏమాత్రం బాగాలేదని అంపైర్లు డిసైడ్ చేశారు. అయితే కలకత్తా మ్యాచ్ సందర్భంలో ముందు రోజు దాకా వర్షం పడినా సరే కేవలం కలకత్తా క్రికెట్ అసోషియేషన్ రెండు మూడు గంటల్లో పిచ్ రెడీ చేశారు. కాని హైదరబాద్ క్రికెట్ అసోషియేషన్ మాత్రం స్టేడియం నిర్వహణ భాధ్యతలను పట్టించుకోవట్లేదని నిన్నటి మ్యాచ్ క్యాన్సిల్ అయినందుకు పూర్తిగా వారి నిర్లక్షమే అంటున్నారు. 


ఐదు వన్ డేల సీరీస్ 4-1 తేడాతో కైవసం చేసుకున్న ఇండియా 3మ్యాచ్ ల టి20 సీరీస్ లో 1-1తో సీరీస్ సమంగా ఉన్నారు. మరి సీరీస్ ఇంతటితో డిక్లేర్ చేస్తారో మ్యాచ్ షెద్యూల్ మారుస్తారో వేచి చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: