ఈమధ్య ఫాంలో ఉన్న టీం ఇండియాకు మొదటి వన్డేనే షాక్ ఇచ్చింది న్యూజిల్యాండ్ జట్టు. ఆసిస్ తో జరిగిన ఐదు వన్డేల సీరీస్ లో 4-1తో ఆస్ట్రేలియాని చిత్తుగా ఓడించిన భారత జట్టు న్యూజిల్యాండ్ తో మొదటి మ్యాచ్ ఓడిపోయింది. ఇక రెండో మ్యాచ్ సీరీస్ డిసైడింగ్ మ్యాచ్ లో మళ్లీ సత్తా చాటింది. పూణేలో జరిగిన ఇండియా కివీస్ రెండో వన్డేలో టీం ఇండియా విజయం సాధించింది.


మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిల్యాండ్ 50 ఓవర్లలో కేవలం 230 పరుగులే చేసింది. టాప్ ఆర్డర్ విఫలమవగా మిడిల్ ఆర్డర్ లో నికోల్స్ 42, గ్రాండ్ హోం 41 పరుగులతో 50 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది న్యూజిల్యాండ్ జట్టు. భువనేశ్వర్ 3 వికెట్లు తీసి విజృంభించగా బుమ్రా 2, చాహల్ 2 వికెట్లు తీశారు.


ఇక లక్ష్యం చిన్నదే అయినా ఓపెనర్ రోహిత్ శర్మ 7 పరుగులకే అవుట్ అయ్యాడు. విరాట్ కొహ్లి 29 పరుగులు చేయగా.. శిఖర్ ధావన్ 68తో పాటుగా దినేష్ కార్తిక్ అజేయంగా 64 పరుగులతో ఇండియా విజయం ఖాయం చేశారు. చివర్లో హార్ధిక్ పాండ్య 30 ధోని 18 పరుగులతో భారత్ కు విజయాన్ని అందించారు. ఇక 3 మ్యాచ్ ల సీరీస్ లో 1-1 తో సీరీస్ ప్రస్తుతం సమం చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: