శ్రీలంకతో రేపటి నుండి జరుగనున్న టెస్ట్ సీరీస్ గురించి భారత వైస్ కెప్టెన్ అంజిక్య రహనే మాట్లాడటం జరిగింది. శ్రీలంక ఎట్టి పరిస్థితుల్లో తక్కువ అంచనా వేయబోమని అన్నారు రహనే. శ్రీలంక మీద రెండు నెలల క్రితమే టెస్ట్ సీరీస్ గెలిచినా సరే వాళ్లు మన దగ్గర ఆడుతున్నారు కాబట్టి టఫ్ ఫైట్ ఉంటుంది. అంతేకాదు నంబర్ వన్ గా కొనసాగాలంటే ప్రతి మ్యాచ్ గెలవక తప్పదు అంటున్నాడు రహనే.


ఇక దక్షిణాఫ్రికాకు వెళ్లే ముందు శ్రీలంకతో ఈ సీరీస్ సన్నాహకంగా అంటే ఈ సీరీస్ కూడా మాకు చాలా ముఖ్యమని అన్నాడు. ప్రస్తుతం జట్టు అన్నివిధాలుగా పటిష్టంగా ఉందని చెప్పారు. ప్రస్తుతం దృష్టంగా శ్రీలంక సీరీస్ మీద మాత్రమే ఉందని.. సౌతాఫ్రికా సీరీస్ అంటే అక్కడికెళ్లాక ఆలోచిచాలని అన్నాడు రహనే. భారత్ తో ఢీ కొట్టి విజయం సాధించి చరిత్ర సృష్టించడానికి శ్రీలంక అన్నివిధాలుగా సిద్ధం అయ్యింది.



మరింత సమాచారం తెలుసుకోండి: