ఇండియా శ్రీంలంకల మధ్య జరుగుతున్న 3 టెస్టుల సీరీస్ లో భాగంగా మొదటి టెస్ట్ ఎట్టకేలకు డ్రాగా ముగించేశారు. మొదటి ఇన్నింగ్స్ తడబడిన ఇండియా రెండో ఇన్నింగ్స్ లో సత్తా చాటింది. తొలి ఇన్నింగ్స్ 172 పరుగులకే ఆలౌట్ అయిన ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ 352 పరుగులకు 8 వికెట్లు కోల్పోయి డిక్లేర్ చేసింది. ఇక 231 పరుగుల లక్ష్యంతో శ్రీలంక రెండో ఇన్నింగ్స్ ప్రారంభించగా 75 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి మ్యాచ్ డ్రాగా మిగిలింది.


సెకండ్ ఇన్నింగ్స్ లో విరాట్ అద్భుతమైన బ్యాటింగ్ తో 104 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. శిఖర్ ధావన్ కూడా 94 పరుగులు చేశాడు. 3 టెస్టుల సీరీస్ లో భాగంగా మొదటి టెస్ట్ ఫైనల్ గా డ్రాగా ముగిసింది. బౌలింగ్ లో భవనేశ్వర్ నైపుణ్యం రెండో ఇన్నింగ్స్ లో బాగుంది. 11 ఓవర్లు వేసిన భువనేశ్వర్ 8 మెయిడెయిన్లు చేసి 8 పరుగులకు 4 వికెట్లు తీశాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: