కొన్నాళ్లుగా ప్రేమ పరవశంలో మునిగితేలుతున్న విరాట్ కొహ్లి, అనుష్క జంటలు ఎట్టకేలకు ఒక్కటయ్యారు. ఇటలీలో పెళ్లి చేసుకున్న ఈ జంట అధికారికంగా పెళ్లి ఫోటోలని ట్విట్టర్ లో పెట్టి అభిమానులతో పంచుకున్నారు. ఈ జంటకు పెళ్లి శుభాకాంక్షలు వెళ్లువెత్తాయి. అయితే ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ పెళ్లి జరిగింది. 


ఈ నెల 21న ఢిల్లిలో రిసెప్షన్ ఏర్పాటు చేస్తారట. రిసెప్షన్ కు మాత్రం సిని, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించాలని అనుకుంటున్నారు. ఇక టీం ఇండియాకు కూడా అందరికి ఆహ్వానం పంపిస్తున్నారట. మొత్తానికి అనుస్క కొహ్లి పెళ్లితో ఒకటయ్యారు. తమ మీద వస్తున్న రూమర్స్ కు చెక్ పెడుతూ సర్ ప్రైజ్ ఇచ్చారు ఈ ఇద్దరు. 


మరింత సమాచారం తెలుసుకోండి: