టీం ఇండియా డ్యాషింగ్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో ఓపెనర్ గా దిగిన రోహిత్ శర్మ 153 బంతుల్లో 208 నాటౌట్ గా నిలిచాడు. ఈ డబుల్ సెంచరీతో వన్డేల్లో 3 డబుల్ సెంచరీలను సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు రోహిత్ శర్మ. వన్డేల్లో డబుల్ సెంచరీ రోహిత్ శర్మకు చాలా ఎజీ అనేంతగా చేశాడు. 13 ఫోర్లు, 12 సిక్సులతో మరోసారి తన బ్యాటింగ్ సత్తా ఏంటో చూపించాడు.  


ఇక మరో పక్క శ్రేయాస్ అయ్యర్ 88, శిఖర్ ధావన్ 68 పరుగులు చేయడంతో 50 ఓవర్లకు టీం ఇండియా 4 వికెట్లు కోల్పోయి 392 పరుగులు సాధించింది. మొదటి వన్ డేలో కుప్పకూలిన టీం ఇండియా రెండో వన్డేలో సరైన బదులు చెప్పింది. ఇక శ్రీలంక గెలవాలంటే 393 పరుగులు చేయాల్సి ఉంది. 3 వన్డేల సీరీస్ లో 1-0తో ముందంజలో ఉన్న శ్రీలంకకు సెకండ్ వన్డేతో సూపర్ షాక్ ఇచ్చారు టీం ఇండియా బ్యాట్స్ మన్.      



మరింత సమాచారం తెలుసుకోండి: