ఇంతకుముందు మనకు ఏదైనా సమాచారం కావాలంటే ఏం చేసేవాళ్ళం..? దానికి సంబంధించిన సమాచారాన్ని పుస్తకంలో వెతికి తెలుసుకునేవాళ్ళం. లేకపోతే ఎవరినైనా అడిగైనా సంబంధిత సమాచారాన్ని తెలుసుకునేవాళ్ళం. ఈ ఆధునిక యుగం కొత్త పుంతలు తొక్కుతున్న కొద్దీ సాంకేతిక రంగం మానవునికి రోజురోజుకు దగ్గరవుతుంది. ప్రపంచం మొత్తాన్ని అరచేతిలో పెట్టుకొని వీక్షంచే టెక్నాలజీ పెరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. టెక్నాలజీ పెరగడం వల్ల సామాన్యుడికి సైతం స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి.

ఈ టెక్నాలజీ యుగంలో మనిషిని టెక్నాలజీని ఇంటర్నెట్ అనుసంధానం చేస్తున్నది. ఏ సమాచారం తెలుసుకోవాలన్నా వెంటనే ఇంటర్నెట్ ఓపెన్ చేసి దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. గూగుల్ వెబ్ సైట్ మనకు ప్రపంచంలోని ఏ విషయం గురించైనా తెలుసుకునే వెసులుబాటుకు కల్పించింది. ఎలాంటి సమాచారమైనా చిటికేలో అందే విధంగా మన టెక్నాలజీ రూపొందింది. చదువుక సంబంధించిన సమాచారాన్ని విద్యార్థులు, వంటకు సంబంధించిన వీడియోలు చూడడానికి యూట్యూబ్ ను మహిళలు రంగం ఏదైనా సమాచారం మాత్రం ఇంటర్నెట్ వైపే మొగ్గు చూపుతున్నారు మన వాళ్ళు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంటర్నెట్ సేవలను ను సంపూర్ణంగా వాడుకుంటున్నాయి. ప్రభుత్వ వెబ్ సైట్ల ద్వారా ప్రజలు సమాచారాన్ని సులువుగా తెలుసుకోగలుగుతున్నారు. ఇంతకుముందు పిల్లలు పుస్తకాల్లో చదువుకునేది, కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది పుస్తకాల స్థానాన్ని ట్యాబ్ లు ఆక్రమించాయి. ప్రభుత్వాలు కూడా విద్యార్థులకు, ప్రజా ప్రతినిధులకు ట్యాబ్ లను అందజేసి వారికి సంబంధించిన అన్ని విషయాలను అందులో నిక్షిప్తం చేస్తోంది. ప్రస్తుత ప్రపంచం ఎలా తయారైందంటే, ఇంటర్నెట్ లేకపోతే మానవును మనగడే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి నెలకొంది.

ప్రస్తుతం మన దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 30 కోట్లకు పై మాటే...! ఈ సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూ వస్తోంది. సమాజం ఆధునికంగా రూపొందించబడే కొద్దీ టెక్నాలజీ దినదినాభివృద్ధి చెందుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ టెక్నాలజీకి నోచుకోని ప్రజలు కూడా మన దేశంలో చాలా ఎక్కువే. దేశ, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి మనిషికి ఇంటర్నెట్ ని అందుబాటులోకి తెచ్చినట్లయితే మన దేశం అభివృద్ధిలో దుసుకుపోతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: