జికా వైరస్.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న జబ్బు ఇది. ప్రత్యేకించి గర్బిణులకు మాత్రమే సోకే ఈ వైరస్ కారణంగా పుట్టే బిడ్డలు తల చిన్నగా.. అవకరాలతో పుడతారన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మాయదారి వైరస్ నలభై దేశాలకు వ్యాపించింది. భవిష్యత్తులో ఈ మాయదారి జబ్బు ప్రపంపం మొత్తం సోకే ప్రమాదముందని దేశాలన్నీ భయపడిపోతున్నాయి. 

ఆ జబ్బు తమ దేశంలోకి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో పలు దేశాలు తలమునకలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓ గుడ్ న్యూస్ వచ్చింది. ఎంతో మంది పసివాళ్ల ప్రాణాలతో చెలగాటం అడుతున్న జికా వైరస్ కు చెక్ చెప్పేందుకు త్వరలోనే టీకా రూపొందించబోతున్నారట. ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఓకే అయిన ఈ టీకా ఈ ఏడాది చివరి నాటికి రెడీ అవుతుందట. 

ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థే నేరుగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 30 కంపెనీలు ఈ వైరస్  వ్యాప్తిని నిరోధించేందుకు.. దాదాపు 14 రకాల వాక్సిన్లు కనుగొనే పనిలో ఉన్నాయి. అమెరికా, ఫ్రాన్స్ , బ్రెజిల్ తో పాటు భారత్ లో కూడా జికా వైరస్  నిరోధక టీకాను కనుగొనే ప్రాజెక్టులు చురుగ్గా సాగుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ఈ ఏడాది చివరి నాటికి కొన్ని ప్రాజెక్టులు ప్రయోగ దశకు చేరుకుంటాయని ఆ సంస్థ అభిప్రాయపడింది. 

అయితే అప్పుడే జికాపై విజయం సాధించినట్టు భావించకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఈ వైరస్ పై మరికొన్నేళ్ల పాటు ప్రయోగాలు చేయడం అత్యవసరమని చెబుతోంది. జికాను అంత తేలిగ్గా తీసుకోకూడదని.. దీని నుంచి ఇంకా ముప్పు పొంచి ఉన్నట్టేనని చెబుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: