ప్రస్తుతం ప్రపంచం మొత్తం టెక్నాలజీతో ఎంతో డెవలప్ అవుతుంది..ముఖ్యంగా దీనికి కారణం సాంకేతిక పరమైన అభివృద్ది. మనిషి తనకంటే వెయ్యిరెట్లు ఎక్కువ పనిచేసే యాంత్రాలు కనిపెడుతున్నారు..దీనిలో ముఖ్యమైనది కంప్యూటర్. కంప్యూటర్ ఆవిష్కరించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. అయితే కంప్యూటర్ పై ఎక్కువ పని చేసేవారికి   కళ్ళు తేలికగా అలసి పోతున్నాయి. ఎంతో వెలుగున్న కంప్యూటర్ స్క్రీన్ కంటికి అలసట కలిగిస్తుంది.


అందుకనే నేడు కంటి అద్దాల వాడకం పెరిగిపోతోంది. కన్ను నష్టపోకుండా దాని కండరాలకు కొన్ని వ్యాయామాలు కలిగిస్తే ఎంతో మంచిది. లేకుంటే అవి గట్టిపడి బలహీనమవుతాయి. ఒత్తిడి తగ్గించే కంటి వ్యాయామం -  కంప్యూటర్ స్క్రీన్ చూస్తూవుంటే, మీ కంటిగుడ్డుకు కదలిక లేదన్నమాట. అది హానికరం. ఇలా చేయండి.....తిన్నగా చూడండి. రెండు సార్లు కళ్లు మూయండి. ఇపుడు కుడివైపుగా ఎంతవరకు వీలైతే అంతవరకు కళ్ళు తిప్పి చూడండి. 30 సెకండ్లు అదేవిధంగా నిలపండి. మరల తిన్నగా చూడండి. ఇదే రకంగా ఎడమవైపుకు కూడా చేయండి.


ఈ వ్యాయామాన్ని 10 నుండి 15 సార్లు చేయండి.  మీ కన్ను ఇపుడు పైకి కూడా చూడాలి. - తిన్నగా చూడండి, రెండు సార్లు కళ్లు మూసి తెరవండి. కళ్లు పైకెత్తి ఎంతవరకు కనపడితే అంతవరకు చూడాలి. 30 సెకండ్లు అలానే వుండి తర్వాత సాధారణ స్ధితికి వచ్చి మరల అదేవిధంగా కిందకు చూడాలి. ఈ కంటి వ్యాయామాన్ని 10 నుండి 15 సార్లు చేయండి.  కంప్యూటర్ పై పని చేసే వారా? - ప్రతి అర గంటకు కళ్ళను స్క్రీన్ పై నుండి వేరే దూరంగా వున్న వస్తువు పైకి అంటే గోడ లేదా గడియారం లేదా మీ బాస్ కేబిన్ డోర్ పైకి మార్చండి.


కంప్యూటర్ ఎక్కుసేపు చూసేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కంప్యూటర్ స్క్రీన్ చూస్తూవుంటే   కళ్ళు అలసి పోతున్నాయా...?

దేనిపైనా చూపు పెట్టకుండా దూరానికి కూడా చూడవచ్చు. దీని తర్వాత కళ్ళను 30 సెకండ్లు మూసి తెరవండి. పని చేయండి. శక్తివంతమైన కాంతి కల కంప్యూటర్ స్క్రీన్ మీ కళ్ళను రిపేరు చేయలేనంతగా కూడా నష్టపరచవచ్చు. కనుక ఈ జాగ్రత్తలు పాటించండి.  కంటి వ్యాయామాలకు ఇంత సమయమని కేటాయించాల్సిన పనిలేదు. కొద్దిపాటి విశ్రాంతిలో వీటిని చేసేయవచ్చు. పడకకు వెళ్లే ముందు, మీ కళ్ళను 5 సార్లు మొదట సవ్యంగాను తర్వాత అపసవ్యంగాను గుండ్రంగా తిప్పండి. కనుగుడ్లు 360 డిగ్రీలు తిరిగేలా చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: