ఆమధ్య రూ. 256 కే స్మార్ట్ ఫోన్ అని ఓ సంస్థ హడావిడి చేసింది. కానీ అది సాకారం కాలేదు. ఇప్పుడు ఇంకో సంస్థ చౌక మంత్రం పఠిస్తోంది. ఈ సంస్థ మాత్రం మోడల్ కూడా చూపించింది. ఆ నమూనా కూడా అదిరిపోయింది. అది కూడా నమ్మశక్యం కాని రేటుకు. ఎంతో తెలుసా.. కేవలం 99 రూపాయలు. మేకిన్ ఇండియా మిషన్ లో భాగంగా ప్రపంచంలోనే అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్ ను ఓ సంస్థ విడుదల చేసింది. 

బెంగళూరుకు చెందిన నమోటెల్ అనే సంస్థ ఈ సాహసానికి సిద్ధపడింది. నమోటెల్  అచ్ఛే దిన్ పేరుతో తయారుచేసిన ఈ స్మార్ట్ ఫోన్లను కేవలం 99 రూపాయలకే అందిస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకే ఈ స్మార్ట్ ఫోన్ ను తయారుచేసినట్టు వివరణ ఇచ్చింది. 

భలే మంచి చౌక స్మార్ట్ ఫోన్.. 


99 రూపాయలకే స్మార్ట్ ఫోనా.. ఎక్కడ కొనుక్కోవాలని అని అడుగుతున్నారా.. ఈనెల 25 వరకు ఆ సంస్థకు చెందిన వెబ్ సైట్ లో స్మార్ట్ ఫోన్ కోసం ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చట.  రేటు తక్కువ కదా అని పీస్ ను తక్కువ అంచనా వేయకండోయ్.. 4 అంగుళాల టచ్ స్క్రీన్.. తో ఈ ఫోన్ తయారైంది. కెపాసిటీ 1GB.

ఇంకా 4GB ఇంటర్నల్  మెమొరీ ఉంది. దీన్ని 32జీబీ వరకు పెంచుకునే ఫెసిలిటీ కూడా ఉందట. వీటితో పాటు ముందు, వెనక  భాగాల్లో కెమెరాలు కూడా ఉన్నాయి. త్రీజీ సౌకర్యంతో డ్యూయల్  సిమ్ అందిస్తోంది. వాస్తవానికి దీని తయారీకి 2, 999 ఖర్చవుతుందట. అయినా దీన్ని 99 రూపాయలకే అందిస్తోందట. ఇంకా నమ్మకం కలగకపోతే.. ముందు ఆర్డర్ బుక్ చేసుకుని ఫోన్ అందుకున్నాక సంతృప్తి పడితేనే సొమ్ము చెల్లించవచ్చట. బావుంది కదూ. 



మరింత సమాచారం తెలుసుకోండి: