భారత సైంటిస్టులు మరో ప్రయోగానికి రెడీ అవుతున్నారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని  షార్‌ మరో అరుదైన ప్రయోగానికి వేదిక అవుతోంది. ప్రయోగాల ఖర్చును అత్యంత తక్కువ ఖర్చుతో చేసేలా ఉపయోగించే పునర్వినియోగ ప్రయోగాన్ని ప్రయోగాత్మకంగా ఈనెల 23న ప్రయేగించనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇది విజయవంతమైతే.. మరో కొత్త శకం మొదలైనట్టే.. 

డాక్టర్ శివన్‌ ఆధ్వర్యాన ఈ వాహక నౌక పూర్తి స్థాయిలో రూపుదిద్దుకుంది.  ఈ ప్రయోగం కోసం దాదాపు 100 కోట్లు ఖర్చయింది. ఈ ప్రయోగం కోసం మొత్తం 750 మంది ఇంజనీర్లు పని చేశారు. వీరిలో 150 మంది విక్రమ్‌ సారాబాయ్‌ స్పేస్‌ సెంటర్‌కు చెందిన ఇంజినీర్లు ఉన్నారు. మిగిలిన 600 మంది ఇస్రోలోని వివిధ కేంద్రాల్లో పనిచేసే వారు ఉన్నారు. 

ఇస్రో ప్రయోగాల్లో కీలక మజిలీ.. 


వీరితో పాటు నేషనల్ ఏరోనాటికల్‌  ల్యాబ్, ఐఐటీ, ఐఐఎస్‌సీకి చెందినవారు కూడా ఈ ప్రయోగంలో పాలుపంచుకున్నారు. ఇప్పటికే ఈ వాహక నౌకలోని ప్రతి భాగాన్ని కఠినంగా పరీక్షించారు. ఆమెరికా ఇప్పటి వరకు 135 సార్లు ఇలాంటి స్పేస్‌ షటిల్స్ పంపింది. అవి అంతగా సక్సస్ కాలేదు. రష్యా రూపొందించిన సింగిల్  స్పేస్‌ షటిల్‌ బూరాన్‌ 1989లో ఒకసారి మాత్రమే విశ్వంలోకి వెళ్ళింది. 

పునర్వినియోగ నౌక ప్రయోగం విజయవంతమయితే ప్రయోగాల ఖర్చు 10 రెట్లు తగ్గే అవకాశం ఉంది. ఈనెల 23వ తేదీ ఉదయం 9.30 గంటలకు పునర్వి నియోగ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్తుంది. ప్రయోగానికి ముందు 8 గంటల పాటు కౌంట్ డౌన్‌ ప్రక్రియ నిర్వహించేందుకు  ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వాహక నౌకను తిరువనంతపురంలోని విక్రమ్‌ సారాబాయ్‌ స్పేస్‌ సెంటర్లో రూపకల్పన చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: