ఉన్నపాటుగా మన ప్రాణాలు తీసే ఉపద్రవాల్లో భూకంపం ఒకటి. భూకంపం వచ్చాక.. అది ఎంత తీవ్రతతో వచ్చిందో లెక్కగట్టే యంత్రాలే కానీ.. రాక ముందే అది ఇక్కడ వస్తుందని మనల్ని అలర్ట్ చేసే పరికరాలు ఇప్పటివరకూ లేవు. ఇప్పుడు మనకు ఆ లోటు కూడా తీరబోతోంది. కాస్త జాగ్రత్తపడితే ప్రాణాలు దక్కించుకునే వెసులుబాటు వచ్చేసింది. 

అదే భూకంపాలను గుర్తించే యాప్.. అవునండీ.. భూకంపాల్ని వెంటనే గుర్తించగలిగే యాప్ అందుబాటులోకి వచ్చింది. మై షేక్ పేరుతో రూపొందిన ఈ మొబైల్ అప్లికేషన్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దీన్ని డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత అది ఫోన్ లో ఉండే యాక్సెలోమీటర్  ఆధారంగా పనిచేస్తుంది. మన చుట్టూ జరిగే భూప్రకంపనల్ని పసిగట్టి అప్రమత్తం చేస్తుంది. 

మీ ప్రాణాలు కాపాడే యాప్.. 



రిక్టర్ స్కేలుతో సమానంగా ఈ యాప్ పనిచేస్తుందని... దీన్ని కనిబెట్టిన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు చెబుతున్నారు. 2.5 తీవ్రత నుంచి 7.8 తీవ్రత వరకు వచ్చే ప్రకంపనల్ని ఈ యాప్ పసిగడుతుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఈ యాప్ ను ఇప్పటివరకు 17 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారట. ఔను మరి ప్రాణాలంటే తీపిలేనిదెవరికి..

ఈ యాప్ భూప్రకంపనలు  చోటు చేసుకున్నప్పుడు కేవలం హెచ్చరించడమే కాకుండా... తక్షణం ఎలా స్పందించాలి, ఎలాంటి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలి లాంటి అంశాల్ని కూడా ఈ యాప్ వివరిస్తుంది. పనికిమాలిన వందలకొద్దీ యాప్ లు మనం సెల్ లోకి ఎక్కించేస్తుంటాం.. ఇలాంటి యాప్ మాత్రం అందరికీ అత్యవసరం.. ఏమంటారు..?



మరింత సమాచారం తెలుసుకోండి: