మీరు ఆల్రెడీ ఫేస్‌బుక్ వాడుతున్నారు కదా? ఫేస్‌బుక్‌లో మనం ఏదైనా పోస్ట్ టైప్ చేసినా, ఫొటో, వీడియోల్ని షేర్ చేసినా నేరుగా అవి News Feedలో మన ఫ్రెండ్స్‌కి కన్పించడంతో పాటు మన timelineలో కూడా ఓ కాపీ సేవ్ చెయ్యబడతాయని తెలిసిందే.  అంటే తమ News Feedలో మనం చేసిన పోస్టులను మిస్ అయిన మిత్రులు నేరుగా మన timelineకి వచ్చి కావలసిన పోస్టులను చదువుకునే వెసులుబాటు లభిస్తుందన్నమాట.

అయితే మనం కొన్ని పోస్టులను టెంపరరీగా మాత్రమే రాయాలనిపించవచ్చు. అలాంటి పోస్టులు అప్పటికప్పుడు news feedలో మాత్రమే కన్పించి మన timelineలో అస్సలు మనం ఆ పోస్ట్ రాసినట్లు తెలీకుండా దాచి పెట్టుకోవాలనుకుంటున్నారా? అయితే ఫేస్‌బుక్ కొద్దిసేపటి క్రితం అందుబాటులోకి తీసుకు వచ్చిన కొత్త సదుపాయం ఉపయోగపడుతుంది. 

ఇకపై ఫేస్‌బుక్‌లో ఏదైనా కొత్త పోస్ట్ చెయ్యడానికి ప్రయత్నించినప్పుడు ఆ క్రిందే Hide From Your Timeline అనే ఛెక్‌బాక్స్  ఒకటి లభిస్తుంది. దాన్ని టిక్ చేస్తే ఆ పోస్ట్ కేవలం News Feedకి మాత్రమే పరిమితం అవుతుంది. అది మీ టైమ్‌లైన్లో స్టోర్ అవదు. ప్రస్తుతం ఈ  కొత్త సదుపాయం ఫేస్‌బుక్‌ని కంప్యూటర్/లాప్‌టాప్‌, మొబైల్ బ్రౌజర్ నుండి వాడుతున్న యూజర్లకి మాత్రమే లభిస్తుంది. ఫేస్‌బుక్ మొబైల్ అప్లికేషన్‌ని వాడుతున్న వారికి ఇది అందుబాటులోకి రావడానికి మరింత సమయం పడుతుంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరు ఫేస్‌బుక్ యూజర్లకి ఈ కొత్త సదుపాయం లభించడానికి మరికొన్ని గంటల నుండి రోజుల సమయం పట్టొచ్చు.  ఈ సదుపాయం కొత్తగా పోస్ట్ చేసేటప్పుడు మాత్రమే లభిస్తుంది. ఇప్పటికే ఉన్న పోస్టులను షేర్ చేసేటప్పుడు కన్పించదు.

మరింత సమాచారం తెలుసుకోండి: