క్యాబ్ ఎక్కాక బోర్ కొడుతోందా? అయితే మీకో శుభవార్త! మిగతా క్యాబ్ సర్వీసుల మాటేమో గానీ Uber మీకు వినోదం అందించడానికి సరికొత్త ఎత్తుగడ వేసింది. Gaana.com సైట్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా రెండు నెలల పాటు ఉచిత మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్‌ని తన ఖాతాదారులకు అందిస్తోంది.

ఇకపై మీరు Uber Black, Uber Go, Uber WiFi, Uber SUVలలో దేన్ని బుక్ చేసుకున్నా రెండు నెలల పాటు ఉచిత Gaana.com మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. "క్యాబ్ ఎక్కినప్పటి నుండి గమ్యస్థానంలో దిగేటంత వరకూ ప్రయాణీకులు తమ సర్వీసుతో గడిపే కాలాన్ని మరింత వారికి ఆహ్లాదాన్ని అందించేలా ఏర్పాట్లు చెయ్యడం ద్వారా ప్రయాణీకుల మనస్సుని దోచుకోవచ్చని" ఉబర్ జనరల్ మేనేజర్ శైలేష్ శవ్లానీ పేర్కొన్నారు. 

Gaana ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ని 42 మిలియన్లకి పైగా వినియోగదారులు ఇప్పటి వరకూ డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ గణాంకాలే దాని పాపులారిటీని తెలియజేస్తున్నాయి. "టైమ్స్ ఇంటర్నెట్" గ్రూప్‌కి చెందిన Gaana ఉబర్‌తో భాగస్వామ్యం ద్వారా మరింత మందికి చేరువయ్యే అవకాశముంది.  ప్రయాణీకులు ప్రయాణ సమయంలో వివిధ భాషల్లోకి తమకు కావలసిన పాటల్ని వినే స్వేచ్ఛ లభిస్తుంది. క్యాబ్ సర్వీసులు తమ వినియోగదారులకు ఇలాంటి వినూత్నమైన సదుపాయాలు కల్పించడం ఇది కొత్త కాదు. ప్రయాణ సమయంలో బోర్ కొట్టకుండా ఉచితంగా వై-ఫై సేవలను ఇప్పటికే అందిస్తున్న విషయం తెలిసిందే. మున్ముందు మరిన్ని ఆసక్తికరమైన సేవలను మనం పొందే అవకాశమూ లేకపోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: