స్మార్ట్ ఫోన్ల మార్కెట్ రోజురోజుకూ విస్తృతమవుతోందట. ఈ ఏడాది ఫ్టస్ట్ క్వార్టర్ లోనే దాదాపు కోటి 50 లక్షల ఫోన్లు అమ్ముడయ్యాయట. సీఎం ఆర్ అనే ఓ సంస్థ చేసిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ కోటీ 50 లక్షల ఫోన్లలో నూటికి 97 స్మార్ట్ ఫోన్లే ఉన్నాయట. 

ఇక సెల్ ఫోన్ కంపెనీల విషయానికి వస్తే.. 32 శాతం విక్రయాలతో శ్యాంసంగ్ కంపెనీ మార్కెట్లో తన సత్తా చాటిందట. ఆ తర్వాత స్థానంలో రిలయన్స్ ఉంది. ఈ సంస్థ  12.6 శాతం విక్రయాలు సాధించిందట. 13.4 శాతంతో అమ్మకాలతో లెనోవో కంపెనీ మూడో స్థానం దక్కించుకుందట. 


టాబ్లెట్ ల అమ్మకాల విషయానికి వస్తే ఈ విభాగంలోనూ శ్యాంసంగ్ కంపెనీయే సత్తాచాటుతోందట. శ్యాంసంగ్ తర్వాత స్థానాన్ని ఆపిల్, ఐబాల్ కంపెనీలు ఆక్రమించాయట. ఇక సెల్ ఫోన్ యాక్ససరీస్ విషయానికి వస్తే.. గతేడాదితో పోలిస్తే డాటా కార్డుల అమ్మకాలు స్వల్పంగా పెరిగాయట. 

భవిష్యత్ అమ్మకాలనూ అంచనా వేసిన సీఎంఆర్ సంస్థ.. ఈ ఏడాది మొత్తం స్మార్ట్ ఫోన్ అమ్మకాలు జోరుగా ఉంటాయంటోంది. స్మార్ట్ ఫోన్లతో పోలిస్తే ట్యాబ్లెట్ అమ్మకాలు బాగా పడిపోతాయట. ఇదే ట్రెండ్ మరో ఐదేళ్ల వరకూ ఉంటుందట. మరి స్మార్ట్ ఫోన్ల స్థానాన్ని ఆక్రమించే కొత్త పరికరం వచ్చేవరకూ దానిదే హవా అన్నమాట. 



మరింత సమాచారం తెలుసుకోండి: