భూమిపై మనిషి ఆదిమానవుడిగా ఉన్నపుడే నిప్పుని కనిపెట్టి దాని ద్వారా ఎన్నో ఉపయోగాలు పొందాడు..అలా మనిషి జీవన క్రమంలో మార్పులు వస్తూన్నా కొలది ఎన్నో ఆవిష్కరణలు చేస్తూ వస్తున్నాడు. భూమి, ఆకాశం, నేల అన్నింటిపై తన ఆదిపత్యాన్ని చాటాడు. ఇప్పటి నవీన కాలంలో మనిషి తన సౌలభ్యం కోసం ఎన్నో నూతన ఆవిష్కరణలు చేస్తూ వస్తునే ఉన్నారు. కమ్యూనికేషన్ కోసం కొత్త టెక్నాలజీతో స్మార్ట్ ఫోన్లు వచ్చాయి. ప్రపంచాన్ని మన ముందు నిలిపే సోషల్ నెట్ వర్క్ ఆవిష్కరించాడు. మనిషి గమ్యాన్ని చేరుకోవడానికి విమానాలు, కార్లు, మోటార్లు ఇలా ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూ సాంకేతిక విప్లవాన్ని సృష్టించారు.


ఇక ఇంటిలో ఆడవారి కోసం వాషింగ్ మిషన్, కుక్కర్,మిక్సీ ఇలా వంటింటి సామాన్లు కొత్త కొత్త మిషన్లు కనిపెడూనే ఉన్నారు. తాజాగా ఇల్లు శుభ్రం చేసుకోవడానికి వాక్యూమ్ క్లీనర్ ని వాడతుంటాం..వీటిలో కూడా కొత్త కొత్త ఫీచర్స్ తో కొత్త మోడల్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో  ‘డైసన్స్’ అనే హోమ్ అప్లయెన్సెస్ సంస్థ ‘డైసన్ 360 ఐ’ పేరుతో రోబో వ్యాక్యూమ్ క్లీనర్లను రూపొందించింది.


కెమెరా సాయంతో ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, సెన్సార్ల సాయంతో చెత్త ఎక్కడ ఉందో గుర్తించి ఈ రోబో స్వీపర్లు గదులను శుభ్రపరుస్తాయి. రోబో స్వీపర్లకు ఎదురుగా ఉన్న వస్తువులను ఢీ కొట్టకుండా ఉండేందుకుగాను ఇన్ ఫ్రా రెడ్ సెన్సర్లను వాటికి అమర్చారు.  అంతే కాదు దీనిలో స్పెషల్ ఏంటంటే దానంతట అదే ఛార్జింగ్ కూడా చేసుకునే విధానం ఉంది. ఈ రోబో స్వీపర్ ను తయారు చేసేందుకు మూడేళ్లు శ్రమించాల్సి వచ్చిందట. 

మరింత సమాచారం తెలుసుకోండి: