ఉదయం లేచిన దగ్గర నుంచీ రాత్రి పడుకునే వరకూ ఇంటర్నెట్ , ఇంటర్నెట్ , ఇంటర్నెట్ అంటూ ఎప్పుడు చూసినా దాన్ని పట్టుకునే బతుకుతున్నాం మనం. ఉదయం లేచాక ఫేస్ బుక్ చెక్ చెయ్యకుండా బాత్ రూమ్ కి కూడా వెళ్ళని జనాలు మనకి తెలిసినవారు బోలెడు మంది ఉన్నారు. అయితే ఇంటర్నెట్ లేని వారి పరిస్థితి ఏంటి ? ఇంటర్నెట్ లేకుండా ఫేస్ బుక్ ని ఓపెన్ చేసి చూడడం కుదరదా ? మీరు గనక ఎయిర్టెల్, ఎయిర్ సెల్ , ఐడియా , టాటా డొకోమో సెల్ ఫోన్ కనక్షన్ కలిగి ఉంటే ఇది సాధ్య పడుతుంది.



అవును నిజం ఇంటర్నెట్ అవసరం అనేది లేకుండానే ఫేస్ బుక్ ని ఉపయోగించచ్చు అని నిపుణులు చెబుతున్నారు. దీనికోసం ఏం చెయ్యాలి అంటే స్టార్ 325 తో పాటు హ్యాష్ సింబల్ ని ప్రెస్ చెయ్యండి. ఫేస్ బుక్ ఇండియా , ఫోనేట్ విష్ భాగస్వామ్యం వినియోగదారులకి ఈ సౌకర్యం కల్పిస్తోంది. ఫోనేట్ విష్ అంటే యూ ఎస్డీ ఆధారంగా పనిచేసే ఒక ఇంటరాక్టివ్ సర్వీసు అన్నమాట. దీనికి డేటా కనక్షన్ తో , ఇంటర్నెట్ తో పని లేదు. రెండు నుంచి కోటానుకోట్ల డివైజ్ లని ఒకే సారి కనక్ట్ చేసుకునే ఛాన్స్ ని ఇది కల్పిస్తుంది. ఇలా చేసి మీరు ఫేస్ బుక్ స్టేటస్ ని చాలా తేలికగా మార్చుకోవచ్చు.\



కాకపోతే ఫోటోలు పోస్ట్ చెయ్యడానికీ, కామెంట్ పెట్టడానికీ , లైక్ చెయ్యడానికి మాత్రం ఇది కుదరదు. పైగా ఫ్రెండ్స్ ని యాడ్ చేసుకోవడం కూడా కష్టమైన పనే. బ్రౌజింగ్ వరకూ ఫేస్ బుక్ మొత్తం తిరగచ్చు. అయితే ఇందులోనే రోజుకి రూపాయి చెల్లించి అన్ లిమిటెడ్ యూసేజీ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ లో ఫేస్ బుక్ యూజర్ పేరు నీ, పాస్ వర్డ్ నీ ఎంటర్ చేసుకోవడానికి ముందర *325# నొక్కితే సరి.


మరింత సమాచారం తెలుసుకోండి: