యాపిల్ కంపెనీ అప్పుడప్పుడూ కొన్ని బంపర్ ఆఫర్లని ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా బాగ్ బంటీ ని నిర్వహించి మరీ తమ అప్లికేషన్ లలో తప్పులు ఏమున్నాయో వెతికి చూపమని ప్రపంచానికి ఛాలెంజ్ విసిరింది ఈ కంపెనీ. గూగుల్ ,ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు చాలా సార్లు ఈ బగ్ బాంటీ ని నిర్వహించి ఉన్నారు. ఇంతవరకూ ఇటువైపు చూడని యాపిల్ సంస్థ ఇప్పుడు బగ్స్ విషయం లో రాజీ పడకూడదు అని తాను కూడా ఇందులో దిగుతున్నట్టు చెప్పింది. ఐ ఫోన్ లలో ప్రమాదకర బగ్స్ ఉన్నట్టు తేల్చడం తో సెక్యూరిటీ లోపాలు బయటపడే అవకాశం ఉంది. సో సెక్యూరిటీ లోపాలు వెతికి బయటపెట్టినవారికి ఈ బంపర్ ఆఫర్ అని చెప్పింది. దాదాపు ఐదు రకాల లోపాలు గుర్తించాలి అని ఈ సంస్థ ఛాలెంజ్ విసిరింది.

వీటి అన్నిటినీ పట్టుకున్నవారికి రెండు లక్షల డాలర్ల వరకూ అంటే దాదాపు కోటీ ముప్పై మూడు లక్షల వరకూ బహుమతి ప్రకటించింది.  బూట్ బగ్స్ ఏమైనా కనిపెట్టినవారికి కోటీ ముప్పై మూడు లక్షలూ, రహస్య సమాచారాన్ని దొంగాలించే ఛాన్స్ లో లోపాలు కనిపెట్టినవారికి అరవై రెండు లక్షలూ ప్రకటించింది. ఇంకా సెక్యూరిటీ బగ్స్ కి 31 లక్షలు ప్రకటించింది. సౌండ్ బాక్స్ టెస్టింగ్ విధానం లో వినియోగదారుల సమాచారాన్ని బయటకి గనక తీసుకుని ఒస్తే 15 లక్షల వరకూ బహుమతి గా ఇస్తాం అంటోంది సంస్థ. ఇంకెందుకు ఆలస్యం ? మీ స్టైల్ లో మీ లెక్కలు మీరు వేసుకుని పని మొదలుపెట్టండి మరి. 


మరింత సమాచారం తెలుసుకోండి: