ఇలా కూడా దొంగతనం చెయ్యొచ్చా ? అని ఆశ్చర్యపోయే రీతిలో ఉంటాయి కొన్ని దొంగతనాలు. తిరువనంతపురం లోని అల్తారా జంక్షన్ లో ఒక పబ్లిక్ సెక్టార్ బ్యాక్ ఏటీఎం లో తెలివిగా ఒక అదునాతన పరికరాన్ని అమర్చారు వీరు. దీని ద్వారా ఏటీఎం ని వాడిన అందరి కార్డులు, పిన్ నెంబర్ లతో సహా తెలుసుకున్నారు ఆ వ్యక్తులు , ఆయా వ్యక్తుల నకిలీ ఏటీఎం కార్డులు తయారు చేసి వారి ఎకౌంటు ల నుంచి నగదు డ్రా చేసేసారు. తమకి తెలియకుండా నే డబ్బులు డ్రా అయిపోతుంటే వినియోగదారులు లబో దిబో అంటూ బ్యాంకులకి చేరుకొని కంప్లయింట్ ఇచ్చుకున్నారు.

 

దీంతో వెంటనే పోలీసులు, బ్యాంకు సిబ్బంది కలిసి ఎక్కడ తేడా వచ్చిందో వెతికి చూసే ప్రయత్నం చేసారు. దాదాపు 22 మంది ఖాతాదారుల ఎకౌంటు ల నుంచి నాలుగున్నర లక్షల వరకూ దోపిడీ కి గురైంది అని సీసీటీవీ కెమెరాల ఆధారంగా ముగ్గురు విదేశీయులని గుర్తించినట్టు చెబుతున్నారు. ఏటీఎం కి  ప్రత్యేక పరికరం అమర్చడం కెమెరా ఫూటేజ్ లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ముగ్గురిలో ఒకతను పరారీ లో ఉండగా ఒకడు ముంబై లో దొరికాడు. మిగిలిన ఇద్దరు అండర్ గ్రౌండ్ లో దాక్కున్నట్టు చెబుతున్నారు.

 

ఈ మధ్య కాలం లో ఏటీఎం లకి సంబంధించిన చోరీ లు ఎక్కువగా జరుగుతున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఖాళీగా, సెక్యూరిటీ గార్డ్ లు లేని ఏటీఎం ల మీద దొంగలు మొదట కన్ను వేస్తున్నారు, ఆ తరవాత జాగ్రత్తగా అందులో ఏదైనా అధునాతన పరికరం ఏర్పాటు చేసి అందులోని ఇన్ఫర్మేషన్ మొత్తం లాగేస్తున్నారు. విదేశీ తెలివితేటలు చూసి మనవాళ్ళు కూడా ఇలాంటి దొంగతనాలు మొదలు పెట్టడం ఈ మధ్యన జరుగుతోంది. అప్రమత్తంగా ఉండడం , జాగ్రత్తలు తీసుకోవడం, ఏటీఎం లో ఏదైనా కొత్త వస్తువు కనపడ్డం జరిగితే ఇంఫారం చెయ్యడం లాంటివి చెయ్యాలి . అన్నిటికంటే ముఖ్యంగా సెక్యూరిటీ గార్డ్ లేని ఏటీఎం ని వాడడం అసలు మంచిదే కాదు .


మరింత సమాచారం తెలుసుకోండి: