4g అనేది ఇప్పుడు పెద్ద ఫేమస్ విషయం. రిలయన్స్ వారు రిలయన్స్ jio అనే పేరుతో కొత్త 4g స్పీడు తో భారత్ లో అంతా సెట్ చేసుకుని లాంచ్ కి ముందర ఆగిపోయింది. LYF స్మార్ట్ ఫోన్ లని అమ్మడం కోసం మార్కెటింగ్ స్త్రాటేజీ కింద JIO సిం కార్డ్ లని ఉపయోగించాలి అనే రూల్స్ ని పెట్టింది. JIO కి ఎందుకంత పాపులారిటీ అంటే ఈ కంపెనీ ప్రివ్యూ ఆఫర్ కింద మూడు నెలల పాటు అన్లిమిటెడ్ 4g ఇంటర్నెట్ కాల్స్ నీ ఎస్సెమ్మెస్ నీ అందిస్తోంది.

 

 అయితే VOLTE అనే సపోర్ట్ ఉన్న ఫోన్ ల మీద మాత్రమె పని చేస్తుంది. LYF ఫోన్ లలో VOLTE కి ఫుల్లు గా సపోర్ట్ ఉంటుంది. VOLTE అంటే వాయిస్ తో ఉన్న 4G ఇంటర్నెట్ అని అర్ధం. మూడు నెలల పాటు చాలా తక్కువ ధర కి అందిస్తున్నారు గానీ మూడు నెలల తరవాత మాత్రం ఆఫర్ లు ఎలా ఉంటాయి అనే విషయం లో ఇప్పటి వరకూ స్పష్టమైన సమాచారం లేనే లేదు. JIO SIM LYF ఫోనుల్లో మాత్రమే పని చేస్తుంది, లేదా అతికొద్ది సెలెక్ట్ చేసుకున్న ఫోన్ ల మీద మాత్రమే పని చేస్తుంది. ఇతర ఫోన్ లలో ఎక్కడా ఇది పని చేసే ఛాన్స్ లు లేవు. సిమ్ పని చెయ్యని పక్షం లో ప్రివ్యూ ఆఫర్ కూడా పని చెయ్యని లంకె పెట్టారు కంపెనీ వారు. అనధికారికం గా JIO యాప్ లో యాక్టివేషన్ అన్ని ఫోన్ లకి మొదట్లో అయ్యేది గానీ ప్రివ్యూ ఆఫర్ కోడ్ యాక్టివేట్ చేసుకోవడానికి మాత్రం రిలయన్స్ స్టోర్స్ కి వెళ్ళాల్సి ఒచ్చేది. ఈ కంపెనీ ఇలాంటి అవకాశాన్ని కూడా ఇప్పుడు తీసేసింది.

 

ఆ సర్వీసులు అధికారికంగా పొందాలి అంటే .. LYF ఫోన్ ని డైరెక్ట్ గా రిలయన్స్ స్టోర్ కి వెళ్లి కొనండి. మీకు ఫోన్ తో పాటు సిమ్ కార్డ్ కూడా ఫ్రీగా ఇస్తారు. సిం ని యాక్టివేట్ చేసుకున్న తరవాత ప్రివ్యూ ఆఫర్ వర్తిస్తుంది. రెండు రోజుల్లో ఇన్విటేషన్ కోడ్ ని పంపిస్తారు రిలయన్స్ వారు. దీనికి ఎక్స్పైరీ డేట్ కూడా ఇస్తారు. ఆ ఎక్స్ పైరీ డేటు వచ్చే లోగా మీ దగ్గర లో ఉన్న స్టోర్ కి డాక్యుమెంట్స్ ని పట్టుకుని వెళ్ళాలి.

 

సామ్ సుంగ్ లో కూడా ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. ఎంచుకున్న బ్రాండ్ లలో మాత్రమె ఇది పని చేస్తుంది మరి ..

 

ఫోన్స్ లిస్టు క్రింద చూడగలరు..

 

Galaxy A5 2015 and A5 2016.

Galaxy A7 2015 and A7 2016.

Galaxy A8.

Galaxy Note 4.

Galaxy Note 5/Galaxy Note 5 Duos.

Galaxy Note Edge.

Galaxy S6.

Galaxy S6 Edge.

Galaxy S6 Galaxy Edge Plus.

Galaxy S7.

Galaxy S7 Edge.


మరింత సమాచారం తెలుసుకోండి: