ఒకే ఒక్క సెకను లో రెండు గిగాబైట్ ల మెమరీ ని ఒక చోటు నుంచి ఇంకొక చోటుకు తరలించడం అనేది కలలో నైనా సాధ్య పడని విషయం. ఎంత ఫాస్ట్ గా ఉండే ఇంటర్నెట్ అయినా సరే కనీసం పది నుంచ పదిహేను నిమిషాల సమయం మినిమం పడుతుంది. కానీ కొత్త రికార్డ్ సృష్టిస్తూ వైర్ లెస్ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేస్తున్న సౌదీ అరేబియా లోని కింగ్ అబ్దుల్లా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఒకే ఒక్క సెకను లో ఇదంతా జరిగే కొత్త పద్ధతి కనిపెడుతున్నారు. ఈ లెక్కన సెకను లో రెండు జీబీ అంటే రెండు సినిమాల వరకూ తక్కువ ఎంబీ ఉన్నవి మూడు సినిమాల వరకూ డౌన్ లోడ్ అయిపోతాయి అన్నమాట. వారు నానో క్రిస్తలిన్ మెటీరియల్ , నీలి రంగు కాంతి నుంచి తెలుగు వర్ణాన్ని వేరు చేయ్యగాలిగిందట. దీంతో ఇంటర్నెట్ వేగం ఊహించనంత మేరకు పెరుగుతుంది. ఒకే ఒక్క సెకను కి 2 జీబీపీఎస్ స్పీడ్ పెరుగుతుంది. కాంతి ని ఆధారంగా చేసుకుని నడుపుతున్న ఈ ప్రయోగం లో సమాచార మార్పిడి చాలా గొప్పగా ఉండబోతోంది అని తర్వలో రాబోయే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి అని శాస్త్రవేత్తలు గర్వంగా చెబుతున్నారు. ప్రస్తుత విద్యుత్ అయస్కాంత తరంగాలని వాడుతూ , సమాచార బట్వాడా జరుగుతూ ఉండగా ఇది కొత్త సంచలనం కాబోతోంది. కాంతి గనక అందుబాటులోకి వచ్చిన తరుణం లో డేటా ట్రాన్స్ఫర్ అన్నిటికంటే వేగంగా జరుగుతుంది అంటున్నారు. ఈ అంచనాతో ఎన్నో సంవత్సరాలు గా ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఇక ఇంత వేగం గనక నిజంగా సాకారం అయితే నెట్ స్పీడ్ అమాంతం పెరిగిపోతుంది ఎంతగా అంటే సెకనుకి రెండు లేదా మూడు సినిమాల వరకూ డౌన్ లోడ్ చేస్కోచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: