రాబోయే రోజుల్లో సాఫ్ట్ వేర్ పరిశ్రమ కి దారుణమైన పరిస్థితి రాబోతోంది. ఉద్యోగులకి ఇది తీవ్రమైన నష్టాన్ని కలగజేస్తుంది అన్నట్టు ఉంది వ్యవహారం. ఐటీ పరిశ్రమ కుదేలు అయ్యే ఛాన్స్ లు భారీగా కనిపిస్తున్నాయి. కొత్త ఉద్యోగాలకి పూర్తిగా తలుపులు మూసుకుపోయే రోజులు ఒస్తున్నాయి అంటున్నారు నిపుణులు. ఉన్న ఉద్యోగులతోనే నెమ్మదిగా కాలం గడపగలం తప్ప కొత్త వారిని తీసుకునే అవకాశమే లేదు అనేది కంపెనీల  వాదన . పెద్ద పెద్ద కంపెనీలు ఇప్పటికే రిక్రూట్ మెంట్ లు ఆపెయ్యడం పరిస్థితి లో ఉన్నా తీవ్రతకి అద్దం పడుతోంది.

దేశ ఐటీ పరిశ్రమ చరిత్రలోనే ఇప్పటి వరకూ ఎవ్వరూ కనీ వినీ ఎరుగని రీతి లో వృద్ధి రేటు ని పడేసుకుంది. ఆ ప్రభావం నెమ్మది నెమ్మదిగా సాఫ్ట్ వేర్ రంగం మీద పడుతోంది. డైరెక్ట్ గా మొదట ఎఫ్ఫెక్ట్ అయ్యేది నియామకాలు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐటీ రంగంలో దిగ్గజాలు అయిన ఇన్ఫోసిస్ , విప్రో లాంటి కంపెనీ లే కొన్నాళ్ళ పాటు ఫ్రెషర్ లని నియమించుకునే ఆలోచన పక్కన పెట్టేయబోతున్నారు. గత రెండు దశాబ్దాలుగా చాలావరకు ఐటీ కంపెనీలు క్యాంపస్ నియామకాల ద్వారా పెద్ద ఎత్తున ఫ్రెషర్లను నియమించుకుంటున్నాయి.

ఇన్ఫోసిస్ సంస్థ ఒక్కటే ఏడాదికి సుమారు 20 వేల మంది ఫ్రెషర్లను నియమించుకుంటుంది.అలాంటి వారు కూడా ఎంప్లాయీస్ ని తీసుకోవడం మానేస్తే సాఫ్ట్ వేర్ రంగం దారుణంగా పడిపోతుంది. దీనినే నమ్ముకున్న వారి జీవితాలు ఏంటి అనేది ప్రశ్నార్ధకం. నియామకాల్లో నాణ్యత ని పెంచడానికి మార్గాల కోసం చూస్తున్నాం అని కంపెనీ ప్రతినిధులు వంకలు చెబుతారు. కాలేజీ ల నుంచి క్యాంపస్ ఇంటర్వ్యూ లు కూడా పూర్తిగా తగ్గిపోయే పరిస్థితి ఉంది. అయితే బాగా తెలివైన, అత్యుత్తమ విద్యార్థులు ఎవరన్న విషయాన్ని తాము చూస్తామని, అలాంటి వాళ్లకు మాత్రం ఢోకా ఉండదని చెబుతున్నారు కొందరు హెచ్ ఆర్ లు. 



మరింత సమాచారం తెలుసుకోండి: