సోషల్ మీడియా లో ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటారు . తన దేశ ప్రజలతో మాట్లాడ్డం కోసం మోడీ నిరంతరం ఎదో ఒక సందేశాన్ని ట్విట్టర్ లో ఉంచుతూ తన సంభాషణ కొనసాగిస్తారు. 2009 లోనే ట్విట్టర్ ఎకౌంటు ఓపెన్ చేసిన మోడీ తనదైన శైలి లో ట్విట్టర్ లో దూసుకుపోతూ ఫాలోవర్ లని పెంచుకుంటారు. భారత దేశం లో ట్విట్టర్ యూజర్ లలో ఎక్కువ మంది ఫాలో అవుతున్న వ్యక్తిగా మోడీ ఇప్పుడు రికార్డు నెలకొల్పారు. ట్విట్టర్ లో ఆయన ఫాలోవర్ ల సంఖ్య 22.1 మిలియన్ లు అయ్యింది. ఆ తరవాత 22 మిల్లియన్ మంది ఫాలోవార్ లతో అమితాబ్ బచ్చన్ టాప్ లో ఉండగా వీరిద్దరి తరవాత షారూక్ ఖాన్ ఉన్నాడు. షారూక్ ని దాదాపు 21 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు. ప్రపంచ స్థాయిలోనే అత్యధికమైన ఫాలోవర్ లు కలిగిన నేతగా బరాక్ ఒబామా ఉండగా ఆయన తరవాత ఆ స్థానం లో మోడీ నిలవడం విశేషం. తాను చెప్పాలనుకున్న విషయాన్ని ముక్కుసూటిగా చెప్పడానికి ఇష్టపడే మోడీ ట్విట్టర్ లో చేరిన రోజు నుంచీ ఒక సెన్సేషన్ గా మారారు. ప్రతిపక్షం లో ఉన్న రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద సీరియస్ అయ్యే వ్యాఖ్యలు ఎన్నో చేసేవారు ఆయన. ప్రజల్లో చైతన్య తీసుకురావడానికి రేడియో నీ యువత తో సంభాషణ కోసం ట్విట్టర్ నీ వాడుతున్నాను అంటారు మోడీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

srk