అమెరికా లోని మసాచుసెట్స్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ అద్భుతాన్ని ఆవిష్కరించారు. వారి కనిపెట్టిన ఒక గొప్ప యంత్రం లెక్క బట్టీ చూస్తే ఈ యంత్రం పుస్తకం తెరవకుండానే అందులో ఏముందో చదివేస్తుంది. దాదాపుగా 9 పేజీలని ఈ యంత్రం చదువుతుంది. పురావస్తు తవ్వకాలు , ఎప్పటి నుచో తెరవడానికి వీలుగా లేని పుస్తకాల్లో ఏముంది అనేది ఇప్పుడు చదివి తెలుసుకోవడం సులువుగా మారింది. పరిశోధకులు ఈ యంత్రం పరిసోధనల్లో చాలా కీలకమైన మార్పులు తీసుకొస్తుంది అంటున్నారు. న్యూయార్క్ లైబ్రరీ లో ఇప్పటి వరకూ ముట్టుకొని పుస్తకాలు బోలెడు ఉన్నాయి వాటి అన్నిటినీ చదివేయచ్చు అంటున్నారు ఇది కనిపెట్టిన వారు. ఈ యంత్రం కనిపెట్టిన వారి లో భారత సంతతి వ్యక్తి కూడా ఉన్నాడు. సాధారణంగా పురావస్తు శాఖ కి దొరికే పుస్తకాలు వివిధ రకాల తాళాలు వేసి ఉంటాయి, ఓపెన్ చేస్తే లోపలి పేజీలు  కూడా నాశనం అయిపోయేంత పాతవిగా ఉంటాయి సో వారికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని చెప్పాలి . 


మరింత సమాచారం తెలుసుకోండి: