యాపిల్ ఐ ఫోన్ 7 సీరీస్ రావడం తో ఐ ఫోన్ 6 కి అనుకున్నట్టు గానే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. 6 సీరీస్ లో అమ్మకాలు సాగవు అని ఊహించిన సంస్థ తన చరిత్రలోనే తొలిసారిగా భారీ తగ్గింపును ప్రకటించింది. ఐఫోన్ 6 ఎస్ సిరీస్ లో పలు వేరియంట్ల ధరలను రూ. 22 వేల వరకూ తగ్గిస్తున్నట్టు తెలిపింది. 6 s 128 జీబీ వేరియంట్ ధర 82 వేలు ఉండగా దాన్ని అరవై వేలకే తగ్గించేసారు. ఈ సంవత్సరం మొదట్లో 4 inch ల ఐఫోన్ 49 వేలు ఉండేది కాస్తా ఇప్పుడు 44 క్కి పడిపోయింది.  కాగా, ఐఫోన్ 7 వేరియంట్లు వచ్చే నెల 7న భారత్ లో అందుబాటులోకి రానున్న సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: