సిమ్ కార్డ్ యాక్టివేషన్ కోసం రోజుల పాటు ఎదురు చూడాల్సిన కష్టాలు తప్పినట్టే అని చెప్పాలి. ఇక మీదట రెండు నిమిషాల్లో సిమ్ యాక్టివ్ అయిపోయే విధానాలు కనపడుతున్నాయి. టెలీకాం కంపెనీలు నో యువర్ కస్టమర్ విధానాన్ని అమల్లోకి తెచ్చి మరీ వీటి గురించి ఆలోచిస్తున్నాయి. ఎయిర్‌టెల్, రిలయన్స్, ఐడియా సంస్థలు ఇప్పటికే ఈ విధానాన్ని అమల్లో పెట్టాయి. దీంతో ధ్రువపత్రాలను కస్టమర్లు ఇక వెంట తీసుకెళ్లాల్సిన పనిలేదు. ఒక్క ఆధార్ కార్డ్ ని తీసుకువెళితే చాలు కొత్త సిమ్ ని రెండు నిమిషాల్లో యాక్టివ్ చేస్తారు. అవుట్ లేట్ లలో ఉన్న సిబ్బందికి ఆధార కార్డు ఇవ్వగానే వారి దగ్గర ఉండే ప్రత్యేక టాబ్లెట్ , స్మార్ట్ ఫోన్ లలో ఆధార్ నెంబర్ ని టైపు చెయ్యడం ఆ వెంటనే వినియోగదారుడి వివరాలు రావడం ఇదంతా వెంటనే జరిగిపోతుంది. దీంతో అరొక పరికరం లో కస్టమర్ యొక్క వేలిముద్రలు తీసుకోవడం జరుగుతుంది. ఈ మొత్తం ప్రక్రియ కి రెండు నుంచి మూడు నిమిషాలు సమయం పడుతుంది. ఈ విధానంలో సిమ్ కోసం చేసుకున్న దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశం కూడా ఉండదు. ఈ మొత్తం వ్యవహారం పారదర్శకంగా ఉండడంతో సిమ్‌లు పక్కదారి పట్టే అవకాశం కూడా ఉండదని కంపెనీలు చెబుతున్నాయి. అంతేకాదు, ఈ-కేవైసీ వల్ల పనిభారం చాలా వరకు తగ్గిపోతుందని చెబుతున్నాయి. సరికొత్త విధానం వల్ల వచ్చే ఐదేళ్లలో టెలికం కంపెనీలకు రూ.10వేల కోట్ల వరకు ఆదా అయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: