ఎక్కడి హైదరాబాద్ , ఎక్కడి అమెరికా ? హైదరాబాద్ కి చెందిన ఒక సాఫ్ట్ వేర్ స్టార్టప్ ని టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ కొనేసింది. మెషీన్ లెర్నింగ్ సాఫ్ట్ వేర్ సంస్థ తుప్ల్ జంప్ ని యాపిల్ కొనుగోలు చేసింది. 2013 లో రోహిత్ రాయ్, బుద్ద వారపు సత్య ప్రకాష్ , దీపక్ ఆలూరు లు సహా వ్యవస్థాపకులు గా తుప్ల్ జంప్ ని మొదలు పెట్టారు. ఈ సంస్థ యూనిక్ సాఫ్ట్ వేర్ ద్వారా ఎక్కువ మొత్తం లో డేటా స్టోర్ చెయ్యడం స్త్ప్రే చేసిన డేటాని తేలికగా ప్రాసెస్ చెయ్యడం దాన్ని విజువలైజ్ చెయ్యడం లాంటి అంశాల్లో భారీ సేవలు అందిస్తున్నారు. అపాచీ స్పార్క్ ప్రాసెసింగ్ ఇంజిన్, అపాచీ కాసాండ్రా, ఎన్ఓఎస్ క్యూఎల్ డేటాబేస్ లాంటి ఓపెన్ సోర్స్ లాంటి డేటా టూల్స్ లో మంచి ప్రవేశం ఉందని వెంచురీ బీట్ వ్యాఖ్యానించింది. రోహిత్ రాయ్, సత్యప్రకాశ్ ఇప్పటికే యాపిల్ లో చేరారని, దీపక్ ఆలూరు అనప్లాన్ లో చేరారని వెంచురీ బీట్ తెలిపింది. యాపిల్ టెక్ సంస్థల విస్తరణలో భాగంగా చిన్న సంస్థలను కొనుగోలు చేస్తోందని టెక్ క్రంచ్ తెలిపింది. అయితే ఈ డీల్ విలువతో పాటు మరింత సమాచారం తెలియాల్సి ఉందని పేర్కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: