ఉదయం లేచినప్పుడు మార్కెట్ లో ఉండే ఫోను రాత్రికి పడుకునే టైం లో ఉండడం లేదు . దీన్ని తలదన్నేది మరొకటి ఒచ్చి మార్కెట్లో చేరుతోంది మరి. వచ్చీ రావడం తోనే అమ్మకాలతో అదరగొట్టిన 3 జీ ఫోన్ లకి ఇప్పుడు కాలం చెల్లింది. అందరూ 4 జీ యావలో పడి 3 జీ ని పూర్తిగా విస్మరిస్తున్నారు. అన్ని నెట్వర్క్ లూ ఇప్పుడు 4 జీ ని ఇస్తున్నాయి సో యువత ఒక్కొక్కరుగా ఆ 4 జీ ఫోన్ లు ఎక్కడ దొరుకుతాయి , ఖరీదు ఎంత ఉండచ్చు అని అంచనాలు వేసుకుంటూ కొనేస్తున్నారు. ఒక పక్క రిలయన్స్ జియో మూడు నెలల పాటు ఉచిత సర్వీసులు అందిస్తూ ఉండగా చాలా మంది 3 జీ ఫోన్ లు పక్కన పెట్టి 4 జీ కి చేంజ్ అయ్యారు. ఎనిమిది సంవత్సరాల క్రితం మొదలైన 3 జీ సేవలు దేశ వ్యాప్తంగా ఇంకా విస్తరించలేదు కూడా ఇలోగానే 4 జీ అడుగు పెట్టేసింది. ఇది పూర్తిగా ప్రజల్లోకి వెళ్లకముందే రిలయన్స్ జియో ప్రకటనతో అందరి దృష్టి అటువైపు మళ్లింది. కేవలం సిమ్ పొందేందుకు కొందరు కొత్తగా 4జీ మొబైళ్లను కొనుగోలు చేశారంటే అతిశయోక్తి కాదు. దీనికి తోడు రూ.3వేల నుంచే ఈ ఫోన్లు మార్కెట్లో లభ్యమవుతుండడంతో కొనుగోళ్లు ఒక్కసారిగా పెరిగాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: