ప్రపంచంలో ఐ ఫోన్ ని మించిన మొబైల్ ఉంటుందా ? యాపిల్ కంపెనీ సృష్టించే ఈ ఫోన్ ల విషయంలో ప్రపంచవ్యాప్తంగా మోజు ఉంది. ఫోన్ అంటేనే యాపిల్ ఫోన్ అన్నచందంగా ఉంటారు జనాలు. కానీ ఐ ఫోన్ కి సైతం షాక్ ఇచ్చే ఫీచర్ లతో సోనీ ఇప్పుడు కొత్త ఫోన్ ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఫీచర్ ల దగ్గర నుంచీ ధర వరకూ అన్నీ ఐ ఫోన్ కి పోటీనే . XPERIA XZ పేరుతో వచ్చిన ఈ ఫోన్ ధర యాభై వేలు సోనీ తన ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్ ఫోన్‌ను ప్రత్యేకమైన ALKALEIDO మెటీరియల్‌తో తయారు చేసింది. ఫోన్ పై మచ్చలంటూ పడవు. 8.1 మిల్లీ మీటర్ల మందంతో రూపుదిద్దుకున్న ఈ ఫోన్ బరువు 161 గ్రాములు. సహసిద్దమైన రంగులని ఉత్పత్తి చేయ్యగలిగే కొత్త ఇంజన్ ఈ ఫోన్ డిస్ప్లే లో సోనీ ఉంచింది.  5.1 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ట్రైల్యూమినస్ డిస్‌ప్లేతో వస్తోన్న ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్ ఫోన్‌లో.. లైవ్ కలర్ ఎల్ఈడి, లైవ్ కలర్ క్రియేషన్ వంటి రిచ్ టోన్ కలర్ ఫీచర్లను పొందుపరిచారు.ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్ ఫోన్‌లో శక్తివంతమైన Snapdragon 820 chipsetను సోనీ నిక్షిప్తం చేసింది. 3 జీబీ ర్యాం తో 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ద్వారా ఫోన్ మెమరీ మరింత విస్తరించుకునే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: