పాకిస్తాన్ తో భారత యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ యూ ట్యూబ్ పాకిస్తాన్ కి కొత్త ఆఫర్ లు ఇస్తోంది. ఎనిమిది నెలల క్రితం మూసేసిన యూ ట్యూబ్ తమ ఛానల్ ని అక్కడ ఓపెన్ చెయ్యడానికి సిద్దం అయ్యింది. ఇంటర్నెట్ కూడా లేకుండానే వినియోగదారులు తమ ఛానల్ ని చూడచ్చు అంటోంది ఆ సంస్థ. ఈ సమయంలో కల్పించడం అనేది అర్థంకాని విషయంలా మారింది. దాదాపు ఎనమిది నెలల తరవాత పాక్ లో యూ ట్యూబ్ తిరిగి మొదలు అయ్యింది . మొదలవ్వడమే కాక కొత్త కొత్త ఫీచర్ లతో పాకిస్తాన్ యూజర్ లకి చేరువ కావాలని చూస్తోంది యూ ట్యూబ్ . ఆఫ్ లైన్ లో కూడా వీడియో లు చూసే ఛాన్స్ ని కల్పించారు. యూ ట్యూబ్ రీ లాంచింగ్ సందర్భంగా కరాచీలోని డీహెచ్ఏ గోల్ఫ్ క్లబ్ లో ఏర్పాటు విలేకరుల సమావేశంలో ఈ ఆఫ్‌లైన్ ఫీచర్లను ప్రకటించింది. పాపులర్ వీడియోలు తాత్కాలికంగా ఆఫ్ లైన్ లోనూ  వీక్షించే అవకాశం కల్పిస్తున్నామని చెప్పింది.


మరింత సమాచారం తెలుసుకోండి: