ఎన్నో సంవత్సరాల తరవాత బాస్ ఈజ్ బ్యాక్ అంటూ చిరు వచ్చినట్టే మరొక బాస్ కూడా మార్కెట్ లోకి వచ్చాడు . అదే నోకియా సెల్ ఫోన్ లు. అవును చాలా సంవత్సరాల తరవాత మార్కెట్ లోకి వచ్చాయి నోకియా సెల్ ఫోన్ లు .. ఫీచర్ ఫోన్ లతో గతం లో ఎందఱో వినియోగదారుల నమ్మకాన్ని చొరగొన్న నోకియా సెల్ ఫోన్ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లతో వస్తోంది. నోకియా 6 అనే పేరుతో రాబోతున్న మొదటి నోకియా ఆంద్రాయిడ్ స్మార్ట్ ఫోన్ సిద్దం అయ్యింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ల‌ను సొంతం చేసుకునేందుకు కేవ‌లం 24 గంటల్లో 2,50,000 మంది రిజిస్ట్రేష‌న్‌ చేసుకున్నారట‌. దీంతో నోకియా ఫోన్‌ల‌పై మార్కెట్లో ఉన్న న‌మ్మ‌కం ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని అర్థ‌మ‌వుతోంది. ఈ నెల 19 నుంచి నోకియా–6 స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. మొబైల్ కాంగ్రెస్ వరల్డ్(ఎండబ్ల్యూసీ)కి ఒకరోజు ముందు (అంటే వ‌చ్చేనెల‌ 26న) మరిన్ని స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెట్టాలని నోకియా బ్రాండ్ లైసెన్సింగ్ హ‌క్కులు పొందిన‌ హెచ్‌ఎండీ ప్ర‌ణాళికలు వేసుకుంటోంది. నోకియా ఫోన్లను ఫాక్స్‌కాన్ రూపొందిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: