టెలికాం రంగంలో తీవ్ర దుమారం రేపి, అప్పటి వరకూ దిగ్గజాలుగా ఉన్న కంపెనీలకు చుక్కలు చూపించిన రిలయన్స్ జియో మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ ఇండియాలో అందుబాటులో లేని 5జీ సేవలను మొట్టమొదటి సారిగా జియో ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఆఫ‌ర్ల మీద ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తూ ప్ర‌త్య‌ర్థి కంపెనీల‌ను గుక్క తిప్పుకోనివ్వ‌కుండా చేస్తోంది. తాజాగా మ‌రోమారు ఇత‌ర కంపెనీల‌ను దెబ్బ కొట్టే వ్యూహంతో ముందుకొస్తున్న‌ట్టు తెలుస్తోంది. జియో క‌నెక్ష‌న్ తీసుకున్న వినియోగ‌దారుల‌కు త్వ‌ర‌లో 5జీ సేవ‌ల‌ను అందించేందుకు స‌మాయ‌త్త‌మ‌వుతోంది. 



అయితే ఈ తతంగానికి చాలా సమయం పట్టేలా ఉన్నప్పటికీ ఇప్పటివరకూ జియో కనెక్షన్ తీసుకున్న కస్టమర్లందరికీ ఈ సేవలను అందించాలనే యోచనలో జియో ఉంది. 5జీ స్మార్ట్‌ఫోన్లను కూడా భారత మార్కెట్లోకి అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. ఆటోమొబైల్ రంగంలోనూ తన హవా చాటాలని ప్రయత్నిస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా ఓ మొబైల్ యాప్ను రూపొందిస్తుందట. ఈ యాప్తో డివైజ్ ద్వారానే వాహన కదలికలను కంట్రోల్ చేయొచ్చట. కేవలం కారు కంట్రోలింగ్ వ్యవస్థనే కాకుండా ఇంధనం, బ్యాటరీ అయిపోతున్నప్పుడు కారు యజమానికి అలర్ట్ వచ్చేలా కూడా ఈ యాప్ దోహదం చేయనుందట. 


రిలయన్స్ జియో మరో ఎత్తుగడ

రిలయన్స్‌ ఏది చేసినా సంచలనమే అన్నట్టు ఫీచర్‌ ఫోన్‌ ద్వారా వోల్టీ సర్వీస్‌ అందిం చేందుకు సిద్ధ మైందని తెలిసిందే.. మరి ఆ ఫోన్‌ ఎలా ఉంటుందో అందరికీ ఆసక్తి ఉంటుంది కదా! దానికి సంబంధించిన ఫొటోలు అనధికారికంగా బయటి కొచ్చాయి. కీబోర్డుతో వచ్చే ఈ మొబైల్‌లో మైజియో, జియో టీవీ, జియో సినిమా, జియో మ్యూజిక్‌ కోసం ప్రత్యేక బటన్స్‌ కూడా ఉన్నాయి. దాదాపు రూ.1500 ఉంటుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: