రోజువారీ డౌన్‌లోడ్ పరిమితిని అప్‌గ్రేడ్ చేసుకోండి అంటూ ‘రిలయన్స్ జియో’ నుంచి మీకు కూడా మెసేజ్ ఏమయినా వస్తే జాగ్రత్త. అయితే వాటిని నమ్మి మోసపోకండి. జియో డౌన్లోడ్ పరిమితినేమి పెంచడం లేదట. సైబర్ క్రిమినల్స్ పన్నిన పన్నాగమే ఈ తప్పుడు మెసేజ్లు అని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇటీవల ఫేస్‌బుక్, ట్విటర్లలో ఓ మెసేజ్ చక్కర్లు కొడుతోంది. ‘రిలయన్స్ జియో వినియోగదారులు తమ రోజువారీ డేటా డౌన్‌లోడ్ పరిమితిని 1 జీబీ నుంచి 10 జీబీకి అప్ గ్రేడ్ చేసుకునేందుకు ఈ లింక్ మీద క్లిక్ చేయండి’ అని ఓ లింక్ ఇస్తున్నారు. 


జియో యూజర్లకు వార్నింగ్.. ఆ మెసేజ్తో జాగ్రత్త!

ఈ లింక్ను క్లిక్ చేస్తే, యూజర్ల మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ అడ్రస్తో పాటు పలు వివరాలను అడుగుతోంది. అన్ని వివరాలను యూజర్లు షేర్ చేసిన అనంతరం ఆ మెసేజ్ను మరో 10 మంది వాట్సాప్ గ్రూప్లకు పంపండంటూ అది అడుగుతోంది. జియో సర్వీసు అప్గ్రేడ్ అవ్వాలంటే  ఆ లింక్ను 10 మంది వాట్సాప్ గ్రూప్స్కు లేదా స్నేహితులకు పంపించాల్సిందేనట. http://upgrade-jio4g.ml/ పేరుతో అచ్చం జియో కంపెనీకి చెందినట్టు చూపిస్తూ ఫేక్ ఆఫర్లలోకి సైనప్ అయ్యేలా బోల్తా కొట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అదే పేజ్‌లో కింద ఇచ్చిన నియమ నిబంధనల్లో మాత్రం తమకు, రిలయన్స్ జియోకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.



దాన్ని చూసుకోకుండా ఈ లింక్ను క్లిక్ చేస్తే, కేవలం తమ వ్యక్తిగత డేటానే కాకుండా స్నేహితులను రిస్కులో పడేసినట్టేనని రిపోర్టులు హెచ్చరిస్తున్నాయి. కంపెనీ ఇటీవలే ఉచిత ఆఫర్ల సర్వీసులను పొడిగిస్తూ హ్యాపీ న్యూఇయర్ ఆఫర్లో రోజువారి కేవలం 1జీబీ డేటానే రిలయన్స్ జియో ఆఫర్ చేస్తుంది. కానీ ఈ ఫేక్ మెసేజ్లు జియో పేరుతో వచ్చి యూజర్లను మోసం చేస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: